AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రామ చిలుకల మృత్యుఘోష..! కుప్పలు తెప్పలుగా పడివున్న దృశ్యాలు వైరల్‌

తుఫాను ధాటికి 30 మంది దాకా మరణించినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే ఝాన్సీలోని సింగర్ గ్రామంలో బలమైన తుఫాను కారణంగా 100 కి పైగా చిలుకలు చనిపోయాయి. 50 కి పైగా చిలుకలు గాయపడ్డాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు.

Watch: రామ చిలుకల మృత్యుఘోష..! కుప్పలు తెప్పలుగా పడివున్న దృశ్యాలు వైరల్‌
100 Parrots Die
Jyothi Gadda
|

Updated on: May 22, 2025 | 7:40 PM

Share

పచ్చని చెట్ల మధ్యలో కుహూ కుహూ అంటూ పలకరించే రామచిలుకలంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. ఒకప్పుడు ఇంటి ముందున్న మామిడి, జామ చెట్లపై పచ్చని రామ చిలుకలు వాలుతూ సందడి చేసేవి. అలా వాటిని చూస్తూ ఉంటే.. మనసుకెంతో ఆహ్లాదంగా ఉండేది. కానీ, నేటి కాలంలో చిలుకలు పంజరాల్లొ తప్ప బయట ఎక్కడా కనిపించటం లేదు.. అలాంటిది ఒక్కసారిగా 100కి పైగా రామచిలుకలు కుప్పలు తెప్పలుగా మృత్యువాతపడ్డాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. భారీ వర్షాలు, తుఫాను కారణంగా వందల సంఖ్యలో రామ చిలుకలు చనిపోయాయి. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మే 21 బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో తుఫాను కారణంగా కురిసిన కుండ పోత వర్షం విధ్వంసం సృష్టించింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి, కొన్ని చోట్ల హోర్డింగ్‌లు కూలిపోయాయి. తుఫాను ధాటికి 30 మంది దాకా మరణించినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే ఝాన్సీలోని సింగర్ గ్రామంలో బలమైన తుఫాను కారణంగా 100 కి పైగా చిలుకలు చనిపోయాయి. 50 కి పైగా చిలుకలు గాయపడ్డాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించింది. దీని తరువాత వారు చనిపోయిన చిలుకలను ఒక గుంటలో పూడ్చిపెట్టారు. చనిపోయిన చిలుకలు నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..