సీఎం ఓఎస్డీని.. డ్యామిట్ దెబ్బకు కథ అడ్డం తిరిగింది.. ఏపీకి చెందిన మాజీ క్రికెటర్ అరెస్ట్..
అతనో మాజీ క్రికెటర్.. రంజీల్లో ఆడాడు.. ఇంతలో దుర్భుద్ది పుట్టింది.. అడ్డగోలుగా సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు.. ఇంకేముంది.. వాట్సప్‌కి సీఎంల డీపీలు పెట్టాడు.. సీఎం పీఏని అంటూ ఒకచోట.. సీఎం ఓఎస్డీ అంటూ మరోచోట.. ఇలా హై ప్రొఫైల్ వ్యక్తులకు ఫోన్ చేయడం.. డబ్బులు డిమాండ్ చేయడం.. మొదలుపెట్టాడు.. ఇంతలోనే కథ అడ్డం తిరిగింది..

అతనో మాజీ క్రికెటర్.. రంజీల్లో ఆడాడు.. ఇంతలో దుర్భుద్ది పుట్టింది.. అడ్డగోలుగా సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు.. ఇంకేముంది.. వాట్సప్‌కి సీఎంల డీపీలు పెట్టాడు.. సీఎం పీఏని అంటూ ఒకచోట.. సీఎం ఓఎస్డీ అంటూ మరోచోట.. ఇలా హై ప్రొఫైల్ వ్యక్తులకు ఫోన్ చేయడం.. డబ్బులు డిమాండ్ చేయడం.. మొదలుపెట్టాడు.. ఇంతలోనే కథ అడ్డం తిరిగింది.. కట్ చేస్తే.. ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు మాజీ రంజీ క్రికెటర్ ను ఊచల వెనక్కి నెట్టారు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్‌డీ పేరుతో చెలామణి అవుతున్న మాజీ రంజీ క్రికెటర్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ గా చెప్పుకుంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుహైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు.. అంతేకాకుండా తాను సీఎం ఓఎస్డీ అని చెప్పుకుంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మెన్ లకు సైతం వాట్సాప్ మెసేజ్‌లు చేశాడు.. ఓఎస్డీ పేరుతో ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసుకున్న నాగరాజు .. పలువురు హై ప్రొఫైల్ వ్యక్తులకు మెస్సేజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
గతంలో కూడా నాగరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడి అరెస్టయ్యాడు.. అంతకుముందు జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో కూడా ఆయన ఫొటోలను డీపీలుగా పెట్టుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇలా మాజీ క్రికెటర్ నాగరాజుపై తెలుగు రాష్ట్రాల్లో 30 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
2014 నుంచి 2016 వరకు శ్రీకాకుళం తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడిన బుడుమూరు నాగరాజు, ఆ తర్వాత క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత మోసాలకు పాల్పడడం ప్రారంభించాడు. గతంలో, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్లు చెప్పి పలు కార్పొరేట్ కంపెనీలను మోసం చేశాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
