AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మాకూ మీ రూల్స్‌ తెలుసమ్మా.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఓ శునకం!

ఓ వీధికుక్క ట్రాఫిక్ నియామాలను పాటిస్తూ రోడ్డు దాటిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ వీడియోలో రోడ్డుపైకి వచ్చిన వీధికుక్క సిగ్నల్‌ పడి వాహనాలు అన్ని ఆగిన తర్వాత జీబ్రా క్రాసింగ్‌ పై నడుచుకుంటూ రోడ్డును క్రాస్ చేసింది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

Hyderabad: మాకూ మీ రూల్స్‌ తెలుసమ్మా.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఓ శునకం!
Anand T
|

Updated on: May 22, 2025 | 5:43 PM

Share

కొన్ని జంతువులు చేసే పనులు అప్పుడప్పుడు మనుషులను బలే ఆశ్చర్యపరుస్తాయి. అవి తమ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటాయి. అలా ప్రవర్తించిన జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో ఎప్పుడూ వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఆ వీడియోలో ఓ మూగజీవి చేసిన పనిని ఏకంగా పోలీసులే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చేసిన పనికి శభాష్ అని మెచ్చుకున్నారు.

వివరాళ్లలోకి వెళితే… ఓ వీధికుక్క ట్రాఫిక్ నియమాలను చక్కగా పాటిస్తున్న రోడ్డు దాటిన ఓ వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులు పోస్ట్ చేసిన వీడియోలో.. ఓ వీధి కుక్క తనకు అన్ని తెలిసినట్టు ట్రాఫిక్‌ నియమాలను పాటిస్తూ రోడ్డు దాటింది. అయితే రోడ్డుపైకి వచ్చిన ఓ వీధికుక్క ఒక సైడ్‌గా వెళ్లి రోడ్డు జీబ్రా క్రాసింగ్ దగ్గరకు వచ్చింది. వాహనాలు అన్ని వెళ్తుండం చూసి అక్కడే ఆగింది. ఇక సిగ్నల్ పడిన వెంటనే వాహనాలు అన్ని ఆగిపోయాయి. అది గమనించిన ఆ వీధికుక్క జీబ్రా క్రాసింగ్ పై నుంచి నుడుచుకుంటూ వెళ్లి రోడ్డు క్రాస్ చేసింది. మళ్లీ ఆ రోడ్డు నుంచి మరో రోడ్డుకు వెళ్లేందుకు కూడా సిగ్నల్ పడే దాకా వెయిట్‌ చేసి .. సిగ్నల్ పడి వాహనాలు ఆగిన తర్వాత.. మళ్లీ జీబ్రా క్రాసింగ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్లి రోడ్డు దాటి వెళ్లిపోయింది.

ఇది గమనించిన అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆ వీధి కుక్క ట్రాఫిక్ నియామాలను పాటిండాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోలీసులు “కొన్నిసార్లు, చిన్న జీవులు కూడా మనకు పెద్ద పాఠాలను నేర్పుతాయి అనే క్యాప్షన్ రాసుకొచ్చారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వీధికుక్క చేసిన పనికి హ్యాట్సాప్ కొడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి