MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్.. 6న విచారణకు హాజరుకాలేనని లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత
ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల మంగళవారం (డిసెంబర్6) సీబీఐ అధికారులను కలిసే అవకాశం లేదని, ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా తమ ఇంటికి రావాలని లేఖలో కోరింది కవిత .

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత సీబీఐకి మరో లేఖ రాశారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల మంగళవారం (డిసెంబర్6) సీబీఐ అధికారులను కలిసే అవకాశం లేదని, ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా తమ ఇంటికి రావాలని లేఖలో కోరింది కవిత . కాగా సీబీఐ పంపిన నోటీసులకు స్పందించిన కవిత ఇంతకుముందే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ కాపీ పంపారు. అయితే ముందుగా ఉన్న ఖరారైన కార్యక్రమాల వల్ల 6న సీబీఐ అధికారులను కలిసే అవకాశం లేదని, ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అధికారులు రావాలని కవిత మరో లేఖ రాసింది. ‘నేను న్యాయవ్యవస్థను నమ్మే వ్యక్తిని. నేను చెప్పిన తేదీల్లో మీరు ఎప్పుడైనా రావొచ్చు. మీ విచారణకు పూర్తిగా సహకరిస్తా’ అని లేఖలో తెలిపింది కవిత. కాగా వెబ్‌సైట్‌లో ఉన్న FIR, నిందితుల జాబితా, ఫిర్యాదును పరిశీలించానని, అందులో తన పేరు ఎక్కడా లేదని కవిత తెలిపింది.
మరోసారి ప్రగతి భవన్ కు..
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పరిణామల నేపథ్యంలో కవిత మరోసారి ప్రగతి భవన్‌కు వెళ్లింది. సీఎం కేసీఆర్‌తో ఆమె సమావేశం కానున్నారని తెలుస్తోంది. సీబీఐ నోటీసులు, ఈ వ్యవహారంలో న్యాయపరంగా, రాజకీయ పరంగా ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మరోసారి కేసీఆర్‌తో చర్చించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్‌లో నవంబర్ 30న ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. ఈ రిపోర్టులోనే కవిత పేరు తెరపైకి వచ్చింది. ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులను సౌత్‌గ్రూప్ చెల్లించినట్టు పేర్కొన్న ఈడీ.. ఈ మొత్తాన్ని సమకూర్చిన వారిలో కవిత పేరును కూడా చేర్చింది. ఈనెల 2న కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6న హైదరాబాద్ లేదంటే ఢిల్లీలోఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..