Telangana: గొంతులో మృత్యువు.. 10 నెలల చిన్నోడి ప్రాణం తీసిన కొబ్బరి ముక్క
చిన్న పిల్లలకు తినడానికి ఏమైనా ఇచ్చేముందు తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీరు ఇచ్చే ఆ పదార్థమే వారి పాలిట మృత్యువు కావొచ్చు.

గొంతులో మృత్యువు. వారం రోజుల్లో 3 విషాదాలు..వారం క్రితం గొంతులో చాక్లెట్ ఇరుక్కుని చిన్నారి..మూడ్రోజుల క్రితం మటన్ ముక్క ఇరుక్కుని మరొకరు..ఇవాళ కొబ్బరి ముక్క గొంతులో చిక్కుకొని 10నెలల బాలుడు మృతి చెందాడు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగింది ఈ విషాద ఘటన. నెక్కొండ మండలం వెంకట్ తండాలో కొబ్బరిముక్క గొంతులో చిక్కుకొని మణికంఠ అనే పది నెలల బాలుడు మృతి చెందాడు
అయ్యప్పస్వామి మాల ధరించిన తండ్రి మాలు..ఇంట్లో నిత్యపూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టారు. ఆదివారం బాలుడు ఏడుస్తుండడంతో కొబ్బరి ముక్క చేతికి ఇచ్చింది తల్లి కవిత. కొబ్బరిముక్క గొంతులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు బాలుడు. వరంగల్‌లో నవంబర్ 27న వరంగల్ పిన్నవారి వీధిలో విషాదం నెలకొంది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి చెందాడు. తండ్రి ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన చాక్లెట్లను.. స్కూల్‌కి తీసుకెళ్లి తిన్న బాలుడు సందీప్..గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు. ఇక ఇటీవల ఓ పెద్దాయన..మటన్ ముక్క గొంతులో చిక్కుకొని ఊపిరాడక చనిపోయాడు.
అన్నవాహిక, శ్వాస వాహికలో పుడ్ చిక్కుకోవడం వల్ల శ్వాస అందక ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు డాక్టర్లు. చాలా రేర్‌గా జరుగుతుంటాయని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..