AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ జిల్లాలో బీఆర్ఎస్ మీటింగ్.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న ఎమ్మెల్సీ కవిత..

జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యరక్తల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఇచ్చిన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్సీ కవిత ఆ ప్రాంతానికి వెళ్లనున్నారు. దీంతో ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏర్పాట్లు చేస్తన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో ఉన్న జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై కవిత 2014 నుంచి ప్రత్యేక దృష్టి సారించింది.

Telangana: ఆ జిల్లాలో బీఆర్ఎస్ మీటింగ్.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న ఎమ్మెల్సీ కవిత..
K Kavitha
Aravind B
| Edited By: |

Updated on: Sep 13, 2023 | 1:53 PM

Share

జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యరక్తల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఇచ్చిన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్సీ కవిత ఆ ప్రాంతానికి వెళ్లనున్నారు. దీంతో ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏర్పాట్లు చేస్తన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో ఉన్న జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై కవిత 2014 నుంచి ప్రత్యేక దృష్టి సారించింది. మొదటగా 2014లో రాష్ట్ర ఏర్పాడ్డాక లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత గెలిచింది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంజయ్ కుమార్.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

అయితే సంజయ్ ఎమ్మెల్యేగా ఓటమి పాలైనప్పటికీ కూడా.. ఆయనను నియోజకవర్గ ఇంఛార్జిగా కవిత ప్రకటించింది. నాలుగేండ్ల వ్యవధిలో కవిత నాయకత్వలో సంజయ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఫలించాయి. దీంతో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ 60 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గతంలో లాగే ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభమయ్యేలా బీఆరఎస్ శ్రేణులు, కార్యకర్తలు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత భారీ స్థాయిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు జరుపుతున్నారు. ఇందుకోసం చల్‌గల్ గ్రామ శివారులో ఉన్న మామిడి మార్కెట్ ఆవరణలో ఏర్పాట్లు అన్ని చేశారు. ఇందుకోసం పలు మండలాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణలు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన కొందరి నేతలు కూడా ఎమ్మెల్సీ కవిత సమక్షంలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా జగిత్యాల ఉండేది. అయితే 2104, 2018లో పలువురు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్‌లోకి చేరారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాడు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను వెతికే పనిలో పడ్డాయి. రానున్న రోజుల్లో ఇంకా మరికొందరు, నేతలు, శ్రేణులు పార్టీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు పలువురు నేతలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నీ తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..