MLC K. Kavitha: ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారు.. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత..
కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత. రైతులకు మద్దతుగా నిలవాల్సిన కేంద్రం.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం సేకరణలో FCIకి సరైన విధానమంటూ లేదని మండిపడ్డారు. ధాన్యం సేకరణపై..
కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత(MLC K. Kavitha). రైతులకు మద్దతుగా నిలవాల్సిన కేంద్రం.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం సేకరణలో FCIకి సరైన విధానమంటూ లేదని మండిపడ్డారు. ధాన్యం సేకరణపై FCI ప్రతి సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కవిత. దేశమంతా ధాన్యం సేకరణ(Paddy Procurement) విధానం ఒకే విధంగా ఉండాల్సిన అవసరముందన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం తో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు గానే తెలంగాణ లోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఆహార భద్రత ముఖ్యమని, భవిష్యత్తులో ఏదైనా సంక్షోభంతో ఆహార కొరత ఏర్పడితే ప్రపంచంలోని ఏ దేశమూ సాయం అందించలేదని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
ఆహార భద్రత కోసమే ఏర్పడిన ఎఫ్‌సీఐకి ఎలాంటి వార్షిక క్యాలెండర్ లేకపోగా, ధాన్యం సేకరణకు సరైన విధానం సైతం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎఫ్‌సీఐ వివిధ రాష్ట్రాల నుంచి ఒక పద్దతి లేకుండా ధాన్యాలను కొంటోందన్న ఎమ్మెల్సీ కవిత.. ప్రతి ఏడాది ఎఫ్‌సీఐ పంట కొనుగోలుకు సంబంధించిన వార్షిక క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వార్షిక క్యాలెండర్ ప్రకారం ప్రతి రాష్ట్రం ఏ పంట పండించాలి అనే విషయంపై అక్కడి రైతులకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రం, కులం, మతంతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా రైతు రైతేనన్న ఎమ్మెల్సీ కవిత, కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదన్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నేపథ్యం భిన్నమైనదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఒకప్పుడు నీటి కొరత ఉన్న తెలంగాణలో గత 8 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ విధానాలతో అద్భుతమైన సాగునీటి వసతులు ఏర్పాటు చేయడంతో పాటు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. రైతుల నుంచి నీటి పన్ను వసూలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అంటూ స్పష్టం చేశారు. రైతు బంధు పథకంతో ఎకరానికి ప్రతి ఏడాది రూ. పదివేల పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు.
In the year 2020, Hyderabad witnessed one of the worst natural calamity – a series of floods. The State Govt under CM Sri KCR stood like a wall for the people and our only hope was support from the centre 1/2 pic.twitter.com/wnT9F5u2TU
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 7, 2022
దీంతో ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరామని.. ధాన్యం కొనుగోలుపై గతంలో హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్రంలోని 61 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. పంజాబ్ లో కొంటున్న విధంగానే తెలంగాణ లోనూ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత, బాయిల్డ్ రైస్, ముడి బియ్యం అంటూ కండిషన్ లు పెట్టకూడదన్నారు.
ఇవి కూడా చదవండి: Viral Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబు… దెయ్యంతో డ్యాన్సేంటి.. వీడియో చూస్తే షాక్
Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..