AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు.. కీలక మార్గాల్లో ‘కవచ్’ విస్తరణ

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టంను దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో 1,445 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాన్ని ముందుకు....

Railway News: దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు.. కీలక మార్గాల్లో 'కవచ్' విస్తరణ
South Central Railway
Ganesh Mudavath
|

Updated on: Apr 07, 2022 | 5:07 PM

Share

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టంను దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో 1,445 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇది కీలక ముందడుగు. గత ఆర్థిక సంవత్సరం 2021-22లో దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో మొత్తం 859 కిమీలను కవచ్‌(Kavach) పరిధిలోకి తెచ్చారు. కవచ్‌ ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి జోన్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అత్యుత్తమ పనితీరు ప్రదర్శన ఇదే కావడం విశేషం. రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డిఎస్‌ఓ) దేశీయ పరిశ్రమల భాగస్వామ్యంతో ‘కవచ్‌’ వ్యవస్థను అభివృద్ధి చేసింది. భారతీయ రైల్వే పరిధిలో రైళ్ల నిర్వహణలో భద్రత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈ వ్యవస్థను అభివృద్ధి పరిచినప్పటి నుంచి అమలు చేయడం వరకు అనేక ప్రయోగాత్మక ట్రయల్స్‌ నిర్వహించింది. ప్రమాదకరమైన రెడ్‌ సిగ్నల్‌(Red Signal) దాటడం (ఎస్‌పిఏడి), రైళ్లు ఎదురెదురుగా ఢీకొనుటను నివారించే రక్షణ వ్యవస్థను కవచ్‌ కలిగి ఉంది. ఒకవేళ రైలు పరిమితిని మించి వేగంగా ప్రయాణించినప్పుడు రైలు వేగాన్ని డ్రైవర్‌ అదుపు చేయలేకపోతే రైలులో బ్రేకింగ్‌ వ్యవస్థ ఆటోమెటిక్‌గా పనిచేస్తుంది. దీనికి అదనంగా, కవచ్‌ వ్యవస్థ పనితీరుతో రెండు రైళ్లు / లోకోమోటివ్‌లు ఢీకొట్టడాన్ని కూడా నివారిస్తుంది.

ఈ వ్యవస్థను అభివృద్ధి పరిచే దశలో భాగంగా.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వాడి-వికారాబాద్‌-సనత్‌నగర్‌, వికారాబాద్‌- బీదర్‌ సెక్షన్లలో 25 స్టేషన్లను కవర్‌ చేస్తూ 264 కి.మీల మేర కవచ్‌ను అమలు చేశారు. అనంతరం 2020-21లో ఈ వ్యవస్థకు అదనంగా 32 స్టేషన్లలో 322 కిమీలు ఏర్పాటు చేశారు. గత ఆర్థిక సంవత్సరం 2021-22లో ఈ వ్యవస్థను అదనంగా మరో 77 స్టేషన్లలో 859 కిమీల మేర ఏర్పాటు చేశారు. దీంతో కవచ్‌ వ్యవస్థ133 స్టేషన్లలో, 29 ఎల్‌సీ గేట్ల వద్ద, 74 లోకోమోటివ్‌ల వద్ద కవర్‌ చేస్తూ మొత్తం మీద 1,445 కిమీలు (ఆటోమెటిక్‌ సిగ్నలింగ్‌ 68 రూటు కిమీలు కలిపి) ఏర్పాటైంది. ఈ వ్యవస్థ కింద మన్మాడ్‌ – ముద్‌ఖేడ్‌ – నిజామాబాద్‌ – సీతాఫల్‌మండి – కర్నూలు – గుంతకల్‌, పర్భని – బీదర్‌ – వికారాబాద్‌ – వాడి, వాడి – సనత్‌నగర్‌ సెక్షన్లు కవర్‌ అయ్యాయి.

కవచ్ ముఖ్యాంశాలు..

  • రైళ్లు / లోకోమోటివ్‌లు ప్రమాదకరమైన రెడ్‌ సిగ్నల్‌ దాటడాన్ని (ఎస్‌పీఏడీ) నివారిస్తుంది.
  • సిగ్నలింగ్‌ తాజా స్థితిగతులను నిరంతరం డ్రైవర్‌ మెషిన్‌ ఇంటర్‌ఫేస్‌ (డీఎమ్‌ఐ)/లోకో పైలట్‌ ఆపరేషన్‌ కమ్‌ ఇండికేషన్‌ ప్యానెల్‌ (ఎల్‌పీఓసీఐపీ)లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
  • అధిక వేగ నియంత్రణకు ఆటోమెటిక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ.
  • రైళ్లు లెవల్‌ క్రాసింగ్‌ దాటే సమయంలో గేట్ల వద్ద ఆటో విజలింగ్‌ వ్యవస్థ.
  • కవచ్‌ వ్యవస్థ కలిగి ఉన్న రెండు లోకోమోటివ్‌లు ఎదురెదురుగా ఢీకొనుటను నివారించవచ్చు.
  • అత్యవసర పరిస్థితులలో సహాయం కోసం సంక్షిప్త సందేశాలివ్వడం.
  • నెట్‌వర్క్‌ మానిటర్‌ సిస్టం ద్వారా రైలు నడిచే మార్గాలపై ప్రత్యేక కేంద్రీకృత పర్యవేక్షణ.

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నారు. అంకిత భావంతో కృషి చేస్తున్నారు. జోనల్‌, డివిజినల్‌లోని సిగ్నల్‌ అండ్‌ టెలికాం అధికారులను, సిబ్బందిని అభినందించారు. తదుపరి దశలలో జోన్‌లోని అధిక భాగం కవచ్‌ నెట్‌వర్క్‌ పరిధిలోకి తీసుకొస్తూ మరిన్ని సెక్షన్లలో కవచ్‌ వ్యవస్థను విస్తరిస్తామని ఆయన అన్నారు.

ఇవీ చదవండి.

Ramarao On Duty: బుల్ బుల్ తరంగ్ అంటూ రాబోతున్న మాస్ మహారాజా.. రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్..

Telangana: గవర్నర్ గౌరవ పోరు.. ప్రభుత్వంతో మరింత పెరిగిన దూరం.. భద్రాచలంలో ఏం జరుగుతుందో…?

ట్రిపులార్‌ సక్సెస్‌ మీట్‌లో తారల సందడి చూశారా.!

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!