Coca Cola Company: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం.. సిద్దిపేటలో కోకాకోలా కంపెనీ ప్లాంటు
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీ తెలంగాణ(Telangana) లో రూ.1000 కోట్లు పెట్టుబడితో ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో భారీ బేవరేజెస్ ప్లాంటు నిర్మించడంతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వేస్ట్....
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీ తెలంగాణ(Telangana) లో రూ.1000 కోట్లు పెట్టుబడితో ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో భారీ బేవరేజెస్ ప్లాంటు నిర్మించడంతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ అండ్ స్కిలింగ్ విభాగంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు హిందూస్థాన్ కోకాకోలా(Coca Cola) సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్(KTR) ట్విట్టర్ ద్వారా తెలిపారు. సిద్ధిపేట సమీపంలో భారీ ప్లాంటు నిర్మాణం జరుపుకోబోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ కూడా పెట్టాలంటూ హిందూస్థాన్ బేవరేజెస్‌ని మంత్రి కేటీఆర్ కోరారు. హిందూస్థాన్ కోకాకోల బేవరేజేస్ కంపెనీతో ఎంవోయూ కుదరిన సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సిద్దిపేట సమీపంలోని బండ తిమ్మాపూర్ దగ్గరున్న ఫుడ్ పార్క్‌లో ఈ ప్లాంటు నిర్మాణం జరగబోతుందని తెలిపారు.
మొదటి దశలో రూ. 600 కోట్లతో ప్లాంట్ నిర్మాణం చేపట్టి, రెండో దశలో రూ. 400 కోట్లతో ప్లాంట్‌ను విస్తరిస్తారని తెలిపారు. ఈ ప్లాంట్‌లో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే కేటాయిస్తారని వెల్లడించారు. జగిత్యాలలో ఉన్న మామిడి పండ్లు, నల్గొండ దగ్గరున్న నిమ్మ ఉత్పత్తులు ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపాందించుకోవాలంటూ హెచ్‌సీసీబీ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్యాకేజింగ్ రంగంలోనూ హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ కేంద్రంగా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు.
Delighted to announce that @HCCB_Official will be setting up a state of the art new plant in Telangana with an investment of ₹1,000 Cr
Have also entered into MoU with Telangana Govt on solid waste, waste water management & Skilling. Also urged them to consider tech R&D center pic.twitter.com/SZV2GvCP4M
— KTR (@KTRTRS) April 7, 2022
Also Read
Srinidhi Shetty: క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్.. వైరల్ అవుతున్న శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫోటోస్
నాని అదిరిపోయే లుక్.. ఇలా ఎప్పుడైనా చూసారా నేచురల్ స్టార్ ని
Shraddha Srinath: ఊహించని రెండు అనుభవాలతో షాక్ తిన్న జెర్సీ భామ.. అవేంటంటే