AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: గవర్నర్ల వ్యవస్థతో ఎలాంటి పంచాయతీ లేదు.. గవర్నర్ ​తమిళిసై కామెంట్స్‌కు మంత్రి కేటీఆర్ కౌంటర్..

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆరోపణలపై కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్‌(Minister KTR). గవర్నర్‌తోగాని, గవర్నర్ల వ్యవస్థతోగాని తమకు ఎలాంటి పంచాయతీ లేదన్నారు. గవర్నర్ తమిళిసైని(Governor Tamilisai) తామెన్నడూ..

Minister KTR: గవర్నర్ల వ్యవస్థతో ఎలాంటి పంచాయతీ లేదు.. గవర్నర్ ​తమిళిసై కామెంట్స్‌కు మంత్రి కేటీఆర్ కౌంటర్..
Minister Ktr
Sanjay Kasula
|

Updated on: Apr 07, 2022 | 5:59 PM

Share

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆరోపణలపై కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్‌(Minister KTR). గవర్నర్‌తోగాని, గవర్నర్ల వ్యవస్థతోగాని తమకు ఎలాంటి పంచాయతీ లేదన్నారు. గవర్నర్ తమిళిసైని(Governor Tamilisai) తామెన్నడూ అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు. వారిని ఎంత గౌరవించాలో అంతే గౌరవించామన్నారు. గవర్నర్‌ గౌరవానికి తామెన్నడూ భంగం కలిగించలేదని స్పష్టం చేశారు. మాజీ గవర్నర్‌ నరసింహన్‌తో తమకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్‌. తనకు తానుగా ఏవో ఊహించకుంటే అందుకు మేమెలా బాధ్యులవుతామంటూ ప్రశ్నించారు. గవర్నర్ కాక ముందు తమిళిసై ఏ పార్టీ నాయకురాలో అందరికీ తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు.

అసలేం జరిగిందంటే..

నిన్న ప్రధాని మోదీతో భేటీ అయిన తమిళిసై లేటెస్ట్‌గా హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. తెలంగాణ పరిస్థితుల్ని వివరించారు. ఓ రిపోర్టును కూడా హోంమంత్రికి అందజేసినట్టు తెలుస్తోంది. అమిత్‌షాతో భేటీ అయిన గవర్నర్‌ తమిళిసై.. హోంమంత్రి ఎదుట తన ఆవేదన వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ కావాలనే అవమానిస్తున్నారని.. రాజ్యాంగ పరంగా, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారని అమిత్‌షాతో వాపోయినట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌తో సామరస్యపూర్వకంగా వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా పట్టించుకోలేదని చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఏనాడూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడలేదు.. డాక్టర్‌గా తెలంగాణలో ఆస్పత్రుల కండీషన్స్‌పై సూచనలు అందించాను.

సోషల్‌ సర్వీసు కేటగిరికి కౌశిక్‌రెడ్డి అనర్హుడనే ఆమోదించలేదు. ఇదే సీఎం కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించి ఉంటుంది. నా మాతృమూర్తి మరణిస్తే కేసీఆర్‌ కనీసం పరామర్శించలేదని అమిత్‌షా ఎదుట తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ను లైట్‌గా తీసుకుంటోంది. ఈ పరిణామం ప్రమాదకరం.

సెలెక్టెడ్‌ రైడ్స్‌ చేస్తున్నారు. చిత్తశుద్ధి కనిపించడం లేదు. బాహుబలి స్థాయిలో ఉన్న లీడర్స్‌ను కొట్టాలంటే ఆ స్థాయిలోనే తెలంగాణలో పోరాటం చేయాలంటూ అమిత్‌షాకు తమిళిసై నివేదిక ఇచ్చారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Viral Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబు… దెయ్యంతో డ్యాన్సేంటి.. వీడియో చూస్తే షాక్

Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..