KTR fire on PM: చాయ్ పే చర్చ కాకుండా పెట్రోల్ ధరలపై చర్చ జరగుతోంది.. ప్రధానిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
ప్రధాని మోడీపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారన్న కేటీఆర్.. ఎండాకాలంలో పండించే వరి(Paddy Grain) పంటను కొనాలని...
ప్రధాని మోడీపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారన్న కేటీఆర్.. ఎండాకాలంలో పండించే వరి(Paddy Grain) పంటను కొనాలని అడిగితే కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు. మీ బియ్యం మీరే తినాలని, నూకలు తినడం నేర్పించండని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ప్రధాని మోడీ(PM Narendra Modi) వ్యవహారశైలి వల్లే దేశంలో చమురు, ఇంధన ధరలు పెరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అధికారంలోకి రాకముందు చాలా పెద్దపెద్ద మాటలు చెప్పిన మోడీ ఇవాళ నోరుమెదపడం లేదని విమర్శించారు. ప్రధాని చెప్పిన చాయ్ పే చర్చ కాకుండా చమురు, ఇంధన ధరల మీదే చర్చ జరుగుతోందని మండిపడ్డారు.
ప్రధాని మోదీ వల్లే చమురు ధరలు ఆకాశన్నంటాయి. మోడీ అధికారంలోకి రాకముందు దేశంలో లీటరు పెట్రోల్ 75, డీజిల్ 53 ఉండేది. ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.120 కి చేరింది. ఇంధన, చమురు ధరలపై ప్రజలను మోసం చేశారు. చాయ్‌పే చర్చ అంటూ గొప్పలు చెప్పిన ప్రధాని.. నేడు నోరువిప్పడం లేదు. బీజేపీ హయాంలో సామాన్యులకు కట్టెల పొయ్యే దిక్కయ్యింది.
– కేటీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి
మరోవైపు.. తెలంగాణలో యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ.. అధికార టీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేంద్రం దిగొచ్చి మద్దతు ధరకు ఆఖరి గింజ కొనేవరకు అవిశ్రాంతంగా పోరాడతామని స్పష్టం చేశారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, కరీంనగర్‌లో గంగుల కమలాకర్, నిజామాబాద్‌లో ప్రశాంత్‌రెడ్డి, నల్గొండలో జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంగారెడ్డిలో తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేడ్చల్‌లో మల్లారెడ్డిలు నిరసనల్లో పాల్గొని కేంద్ర వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు.
Also Read
Agriculture News: రైతులకి మంచి బిజినెస్.. వీటి పెంపకంతో అదనపు ఆదాయం..!