Summer Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లు..

Summer Special Trains: వేసవి సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లాలనుకుంటారు. అదేవిధంగా హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేసేందుకు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకుంటారు.

Summer Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లు..
South Central Railway
Follow us
Basha Shek

|

Updated on: Apr 07, 2022 | 5:55 PM

Summer Special Trains: వేసవి సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లాలనుకుంటారు. అదేవిధంగా హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేసేందుకు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకుంటారు. దీంతో సహజంగానే సమ్మర్‌ లో ప్రయాణాలు పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ప్రధాన నగరాల మధ్య దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇందులో భాగంగా తెలుగురాష్ట్రాల్లోని రెండు ప్రధాన నగరాలైన సికింద్రాబాద్‌ (Secunderabad)- తిరుపతి(Tirupati)ల మధ్య కూడా పలు సమ్మర్‌ స్పెషల్‌ సర్వీసులు నడుస్తున్నాయి. కాగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల మధ్య మరో రెండు రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు (ఏప్రిల్‌8) న రాత్రి 8 గంటలకు 07597 నంబరు గల రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలు దేరి నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

చెన్నై వెళ్లే వారికోసం..

అదేవిధంగా ఏప్రిల్‌ 10న రాత్రి 7.50 గంటలకు 07597 నంబరు గల రైలు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక చెన్నై వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ పశ్చిమ రైల్వే (South Western Railway) రెండు వీక్లీ స్పెషల్‌ ట్రైన్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 06223 నంబరు గల రైలు శివమొగ్గ స్టేషన్‌ నుంచి బయలుదేరి భద్రావతి, తరికెరె, బీరూర్‌, అజంపురా, హోసదుర్గా, చిక్కజాజూర్, చిత్రదుర్గ, చల్లకేరే, మొలకల్మురు, రాయదుర్గ్‌, బళ్లారి, గుంతకల్‌, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, అరక్కోణం స్టేషన్ల మీదుగా చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ ఏప్రిల్‌ 17 నుంచి జూన్‌ 28 వరకు ప్రతి ఆదివారం, మంగళవారాల్లో నడుస్తుంది. అదేవిధంగా 06224 నంబర్‌ గల రైలు చెన్నై సెంట్రల్‌ నుంచి శివ మొగ్గ స్టేషన్‌కు బయలుదేరుతుంది. ఏప్రిల్‌ 18 నుంచి మే 29 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో ఈ స్పెషల్‌ ట్రైన్‌ నడుస్తుంది.

Whatsapp Image 2022 04 07 At 5.08.58 Pm

Also Read:Benefits Of Chilli Pickle: పచ్చి మిరపకాయ పచ్చడి తింటే అద్భుతమైన లాభాలు.. ఈ సమస్యలను తగ్గిస్తుంది..

IPL 2022: అరంగేట్రంలోనే అదరగొట్టిన బేబీ డివిల్లియర్స్‌.. మ్యాచ్‌కే హైలెట్‌గా మారిన నో లుక్‌ సిక్స్‌ చూశారా?

AP Cabinet Meeting: కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం.. మరికాసేపట్లో మంత్రుల రాజీనామా..!