AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime: స్మగ్లింగ్ లో వీరి రూటే సపరేటు.. నలగని షర్టు, చెదరని జుట్టు.. ఇంత చేసినా చివరికీ..

పురుషులందు పుణ్య పురుషులు వేరు అన్నట్టు గంజాయి స్మగ్లింగ్(Smuggling) లో ఈ స్మగ్లర్ల రూటే వేరు. నలగని షర్టు, చెదరని జుట్టు పైగా ఏసీ బోగీల్లో ప్రయాణం. జర్నీల్లో కాస్ట్లీ కలరింగ్ ఇస్తూ ఇతరులకు డౌట్ రాకుండా ఈజీగా మత్తు పదార్థాకు రాష్ట్రాలు దాటించేస్తారు....

Hyderabad Crime: స్మగ్లింగ్ లో వీరి రూటే సపరేటు.. నలగని షర్టు, చెదరని జుట్టు.. ఇంత చేసినా చివరికీ..
Rachakonda Police
Ganesh Mudavath
|

Updated on: Apr 07, 2022 | 7:40 PM

Share

పురుషులందు పుణ్య పురుషులు వేరు అన్నట్టు గంజాయి స్మగ్లింగ్(Smuggling) లో ఈ స్మగ్లర్ల రూటే వేరు. నలగని షర్టు, చెదరని జుట్టు పైగా ఏసీ బోగీల్లో ప్రయాణం. జర్నీల్లో కాస్ట్లీ కలరింగ్ ఇస్తూ ఇతరులకు డౌట్ రాకుండా ఈజీగా మత్తు పదార్థాకు రాష్ట్రాలు దాటించేస్తారు. ఇపుడు పాపం పండి రాచకొండ(Rachakonda) పోలీసులకు చిక్కారు. అసలు ఈ కేటుగాళ్లు గంజాయి, హ్యాష్ ఆయిల్ ను ఎలా రాష్ట్రాలు దాటిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో మత్తు పదార్థాలను అరికట్టడం పోలీసుల ఫస్ట్ ప్రియారిటీగా మారింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్ధాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ బ్యాచ్ గంజాయి, హ్యాష్ ఆయిల్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారం అందడంతో ఎల్బీ నగర్(LB.Nagar) ఎస్వోటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రైడ్ చేసి గంజాయి, హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న నలుగురు సభ్యులున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 52 కేజీల గంజాయి, ఒక లీటర్ హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

రాచకొండ పోలీసులు పట్టుకున్న ఈ బ్యాచ్ ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా ఈ ముఠా హ్యష్ ఆయిల్ ను వైజాగ్ నుంచి వయా హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తోంది. ఢిల్లీకి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి ఈ బ్యాచ్ ను ఎంగేజ్ చేసుకుని వీరితో డ్రగ్స్ రవాణా చేయిస్తునట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఇమ్రాన్ పంపిన ఈ ముఠాను వైజాగ్ లో విజయ్ అనే వ్యక్తి రిసీవ్ చేసుకుని ఈ బ్యాచ్ కు హ్యష్ ఆయిల్ అందజేశాడు. అనంతరం ఈ నెల ఐదో తేదీన దువ్వాడ రైల్వే స్టేషన్ లో గంజాయితో ట్రైన్ ఎక్కినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుండి డిల్లీ వెళ్లాల్సిన ఈ గాంగ్ మౌలాలిలో దిగింది. ఈ మధ్య కాలంలో రైల్వే స్టేషన్లలో కూడా చెకింగ్ లు ఎక్కువ కావడంతో ఆ విషయం పసిగట్టిన నిందితులు అక్కడ దిగినట్టు రాచకొండ సీపీ వెల్లడించారు. మౌలాలి దిగిన అనంతరం అక్కడే సాయంత్రం దాకా ఉన్న ఈ ముఠా దక్షిణ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీ వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్వోటి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితులు నలుగురు ట్రావెల్ బ్యాగ్ లో తరలిస్తున్న గంజాయి, హ్యాష్ ఆయిల్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని సీపీ స్పష్టం చేశారు.

గంజాయి తరలించడంలో ఈ గాంగ్ రూటే సపరేటు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ముఠా తాము ఉన్నత శ్రేణి వ్యక్తులం అన్నట్టు ఎదుటివారు భ్రమ పడేలా వ్యవహార శైలి ఉంటుంది. గంజాయి హ్యాష్ ఆయిల్ ను నీట్ గా కాస్ట్లీ బ్యాగ్ లలో ప్యాకింగ్ చేసి, వైజాగ్ నుంచి ఢిల్లీకి వయా హైదరాబాద్ మీదుగా ఏసీ బోగీల్లో ప్రయాణిస్తూ రైల్వే పోలీసులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. మార్కెట్ లో హ్యష్ ఆయిల్ కు అలాగే గంజాయి కి విపరీతమైన డిమాండ్ ఉండటంతో నిందితులు ఈ మత్తు పదార్థాల తరలింపునకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు ఈ గాంగ్ ఎంగేజ్ చేసుకున్న ఢిల్లీకి చెందిన ఇమ్రాన్ ను పట్టుకోవడానికి రాచకొండ పోలీసులు ఢిల్లీ కి వెళ్లనున్నారు.

Also Read

TOP 9 ET News: శృంగార తార మదిలో రామ్ చరణ్‌ | గాలి వార్తలపై మహేష్ గరం గరం

PMAY: సొంతింటి కల.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం ఆన్‏లైన్‏లో ఇలా అప్లై చేసుకోండి..

Agriculture News: రైతులకి మంచి బిజినెస్.. వీటి పెంపకంతో అదనపు ఆదాయం..!