Hyderabad Crime: ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం.. నాలుగో అంతస్థు నుంచి దూకి రోగి ఆత్మహత్య

హైదరాబాద్(Hyderabad) ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం రేగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి.. ఆస్పత్రి నాలుగో అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...

Hyderabad Crime: ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం.. నాలుగో అంతస్థు నుంచి దూకి రోగి ఆత్మహత్య
Death
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 07, 2022 | 9:15 PM

హైదరాబాద్(Hyderabad) ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం రేగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి.. ఆస్పత్రి నాలుగో అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరుపై వివరాలను ఆరా తీస్తున్నారు. మృతుడి బంధువులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్(Balapur) మండలం వీరెక్ కాలనీకి చెందిన నాగరాజు.. ఈనెల 2 న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అతని భార్య, కుటుంబసభ్యులు నాగరాజుకు వైద్య చికిత్స అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రికే తీసుకువచ్చారు. అక్కడ నాగరాజును పరీక్షించిన వైద్యులు.. చికిత్స అందిస్తున్నారు.

నాగరాజుకు మద్యం అలవాటు ఉండడంతో ఆస్పత్రిలో మద్యం తాగాడు. ఇలా చేయవద్దని భార్య మందలించడంతో నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కోపంలో భార్యను పక్కకు తోసేసి నాల్గో అంతస్థులోకి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికి కిటికీ అద్దాలను పగలగొట్టి అందులోనుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో నాగరాజు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోషిణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

ఈ ఆలయంలో మద్యమే ప్రసాదం !! వెలుగులోకి వెరైటీ జాతర !!

Viral Photo: 6గురు యువతులు.. 5 జతల కాళ్లు.. మీ కళ్లకు పరీక్ష.. కనిపెడితే మీరే జీనియస్!

Minister KTR: గవర్నర్ల వ్యవస్థతో ఎలాంటి పంచాయతీ లేదు.. గవర్నర్ ​తమిళిసై కామెంట్స్‌కు మంత్రి కేటీఆర్ కౌంటర్..