TS RTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్.. తెలంగాణలో మళ్లీ పెరగనున్న బస్ చార్జీలు..? ఎంత పెరుగుతాయంటే..

తెలంగాణలో సామాన్యుడి ప్రయాణం మరింత ప్రియం కానుంది. మరో వడ్డనకు ప్రతిపాదనలు రంగం సిద్ధం చేసింది టీఎస్ఆర్టీసీ. డీజిల్ సెస్ పేరుతో 10 నుంచి 15 శాతం మళ్లీ చార్జీలు మోతెక్కనున్నాయి.

TS RTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్.. తెలంగాణలో మళ్లీ పెరగనున్న బస్ చార్జీలు..? ఎంత పెరుగుతాయంటే..
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 07, 2022 | 8:52 PM

తెలంగాణలో ప్రయాణీకులపై మరో భారం మోపనుంది టీఎస్ఆర్టీసీ(TS RTC). రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్ ధరలు, పీకల్లోతు నష్టాలతో సతమతమవుతున్న ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు చార్జీలు పెంచే యోచన చేస్తుంది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. దీంతో మరోసారి ప్రయాణీకులపైనే మోపేందుకు సిద్ధమైంది. నష్టాలు తగ్గించుకునేందుకు డీజిల్ సెస్ పేరుతో 10-15శాతం ఛార్జీల పెంపు యోచనలో ఉంది ఆర్టీసీ యాజమాన్యం.ఇప్పటికే మార్చిలో రౌండప్‌ చార్జీలు, టోల్‌ సెస్‌, ప్యాసింజర్‌ సెస్‌ పేరిట 10 శాతానికిపైగా చార్జీలు పెంచింది TSRTC. రౌండప్‌ చార్జీలు, సెస్‌ల పెంపుదలతో రోజుకు కనీసం కోటి రూపాయల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేసింది. కానీ రోజుకు 10-12 కోట్ల ఆదాయం మాత్రమే రావడంతో మరోసారి సెస్‌ పేరుతోనైనా మరికొంత ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.

రోజుకు 16 కోట్లకు పైగా ఆదాయం వస్తేనే ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విధించిన సెస్సులకు తోడు కొత్తగా డీజిల్‌ సెస్‌ అదనంగా వసూలు చేయాలని ఆలోచిస్తోంది RTC. పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా ఈ సెస్ వసూలు చేస్తామంటోంది.

ఈ సెస్‌ పేరిట చార్జీలను మరో 10 నుంచి 15 శాతం వరకు సవరించాలని సంస్థ ప్రతిపాధిస్తుంది. దీనితో పాటు ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సెస్‌ పేరుతో మరో పెంపును కూడా త్వరలో అమలు చేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక ఇప్పటికే బస్‌ పాస్‌ ధరలను ఆ సంస్థ పెంచింది.

చిన్న సర్దుబాటే అని TSRTC చెబుతున్నా అన్నీ కలిపేసరికి ప్రయాణికులపై పెద్ద భారమే పడుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌, వాటితో పాటు పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నాడు సగటు జీవికి.. టీఎస్ఆర్టీసీ తాజా నిర్ణయంతో సామాన్యుడి ప్రయాణం మరింత ప్రియం కానుంది.

ఇవి కూడా చదవండి: Viral Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబు… దెయ్యంతో డ్యాన్సేంటి.. వీడియో చూస్తే షాక్

Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు