AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Schools: తెలంగాణ విద్యార్థులకు సూచన.. మరో సారి మారిన పాఠశాల సమయాలు..

తెలంగాణ విద్యార్థులకు ముఖ్య సూచన. పాఠశాలల పనివేళలు మరోసారి మార్పులు చేసింది విద్యాశాఖ. కొద్ది రోజుల క్రితం ఒంటిపూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎండలు విపరీతంగా ఉండటంతో..

Telangana Schools: తెలంగాణ విద్యార్థులకు సూచన.. మరో సారి మారిన పాఠశాల సమయాలు..
Telangana Schools
Sanjay Kasula
|

Updated on: Apr 07, 2022 | 9:16 PM

Share

తెలంగాణ విద్యార్థులకు ముఖ్య సూచన. పాఠశాలల పనివేళలు( school timings) మరోసారి మార్పులు చేసింది విద్యాశాఖ. కొద్ది రోజుల క్రితం ఒంటిపూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎండలు విపరీతంగా(heat wave) ఉండటంతో పనివేళల్ని కుదించింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడుల్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి పనివేళల్ని మార్చింది. కొత్త సమయ సారిణి ని విడుదల చేసింది. ఎండలు దంచి కొడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు 11.30 గంటల వరకు పాఠశాలల్ని నిర్వహించింది. ఇప్పుడు పనివేళల్ని మళ్లీ మార్చింది. పాఠశాలల్ని 12.30 గంటల వరకు నడపాలని తాజాగా పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు పని చేయనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట బడుల్ని తప్పనిసరిగా పటించాలని ఆదేశించింది. మార్చి 15 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని పేర్కొంది. అయితే మార్చి చివరి వారంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ టైమింగ్స్‌ని కుదించింది తెలంగాణ ప్రభుత్వం.

వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు మాత్రమే పాఠశాలల్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు 11.30 గంటల వరకే స్కూళ్లు నడిచాయి.

ఇక నేటి నుంచి మిగిలిన రోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 23న ఫలితాలు విడుదలవుతాయి.

పాఠశాలలకు ఏప్రిల్ నుంచి సమ్మర్ హాలిడేస్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదవ తరగతి, ఓఎస్‌ఎస్‌సీ, వొకేషనల్, రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. వాస్తవానికి మే 11 నుంచి మే 20 వరకు మధ్య ఎగ్జామ్స్ జరుగుతాయని ముందుగా ప్రకటించిన మే 23 నుంచి జూన్ 1 వరకు షెడ్యూల్‌ను మార్చింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి: Viral Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబు… దెయ్యంతో డ్యాన్సేంటి.. వీడియో చూస్తే షాక్

Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..