NMDC Recruitment: హైదరాబాద్‌ ఎన్‌ఎండీసీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నర జీతం..

NMDC Recruitment: నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ హైదారాబాద్‌లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ...

NMDC Recruitment: హైదరాబాద్‌ ఎన్‌ఎండీసీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నర జీతం..
Nmdc Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 08, 2022 | 8:14 AM

NMDC Recruitment: నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ హైదారాబాద్‌లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, సీఎస్‌ఆర్‌, లా, ఫైనాన్స్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌, సివిల్‌, ప్రాజెక్ట్‌, ఎన్విరాన్‌మెంట్‌, ఫైర్‌ సర్వీసెస్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సేఫ్టీ, గ్యాస్‌ సేఫ్టీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, లా డిగ్రీ, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థాలు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,50,000 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 04-05-2022 మొదలు కాగా, చివరి తేదీగా 25-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన తల్లి జింక.. హృదయాలను కదిలించే వీడియో వైరల్

ఈ ఆలయంలో మద్యమే ప్రసాదం !! వెలుగులోకి వెరైటీ జాతర !!

Best Summer Drink: వేసవి తాపాన్ని తీర్చే చౌకైన సహజ పానీయం !!