Viral Video: తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన తల్లి జింక.. హృదయాలను కదిలించే వీడియో వైరల్

Viral Video: సృష్టిలో జీవి ఏదైనా తల్లి ప్రేమ ఒకటే. దీన్ని నిరూపించేలా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. హృదయాన్ని కదిలిస్తున్న ఆ వీడియో (Video) సోషల్ మీడియా (Social Media)లో..

Viral Video: తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన తల్లి జింక.. హృదయాలను కదిలించే వీడియో వైరల్
Follow us
Subhash Goud

|

Updated on: Apr 08, 2022 | 5:49 AM

Viral Video: సృష్టిలో జీవి ఏదైనా తల్లి ప్రేమ ఒకటే. దీన్ని నిరూపించేలా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. హృదయాన్ని కదిలిస్తున్న ఆ వీడియో (Video) సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి ఎంత దూరమైనా వెళుతుంది. ప్రాణాలను కూడా పక్కనపెట్టి బిడ్డ కోసం పనిచేస్తుంది. ఇందుకు పక్కా ఉదాహరణగా నిలిచే ఓ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి జింక, తన బిడ్డను రక్షించుకునేందుకు ప్రాణత్యాగం చేసింది. మనిషైనా, జంతువైనా, తల్లి ప్రేమ ఒకటే అని నిరూపించింది ఆ జింక. ఐఏఎస్ (IAS) ​ఆఫీసర్​సోనాల్​ గోయల్ (Sonal Goel), ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్​ చేశారు. ఆ వీడియోలో ఓ జింక పిల్ల నదిలో ఈత కొడుతూ ఉంది. అదే నదిలోని ఓ మొసలి జింక పిల్లను చూసింది. ఆహారం కోసం ఆ జింక పిల్లపై దాడి చేసేందుకు అటువైపు వేగంగా కదిలింది. దీన్ని దూరం నుంచి చూసిన ఆ తల్లి జింక, నదిలోకి దూకి వేగంగా బిడ్డవైపు కదిలింది.

బిడ్డకు, మొసలికి మధ్య అడ్డుగా నిలిచింది తల్లి జింక. బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి మొసలికి ఆహారంగా మారిపోయింది. తన ప్రాణ త్యాగంతో బిడ్డను రక్షించుకుంది. తల్లి జింకను నోట కరుచుకుని మొసలి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పిల్ల జింక ఒంటరిగా మిగిలిపోయింది. గడ్డపైకి చేరిన పిల్ల జింక బిక్కుబిక్కుమంటూ తల్లికోసం చూసింది. తల్లి ప్రేమను వర్ణించేందుకు మాటలు సరిపోవని, బిడ్డను రక్షించుకునేందుకు తల్లి జింక చేసిన ప్రాణత్యాగం హృదయాన్ని కదిలిస్తోందన్నారు ఐఏఎస్​ఆఫీసర్​సొనాల్​గోయల్. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఎప్పటికి విడిచిపెట్టకూడదని ఈ వీడియో మనకు గుర్తుచేస్తోందన్నారు. వాళ్లని గౌరవించాలి, వారికి సేవ చేయాలని ట్వీట్టర్‌లో రాసుకొచ్చారు ఐఏఎస్​ఆఫీసర్​ సొనాల్​ గోయల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి జింక ప్రాణత్యాగం అందరిని కదిలిస్తోంది. తల్లిప్రేమను గుర్తుకుచేసే విధంగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Deer

ఇవి కూడా చదవండి:

Viral Video: ఇదేందయ్యా ఇది.. బర్త్‌డే రోజున యువతికి ఇలా షాకిచ్చారు.. వీడియో వైరల్!

Viral Video: సూట్ వేసుకొని పానీపూరి అమ్ముతున్న యువకులు.. కారణమేంటో తెలిస్తే షాకే..