Viral Video: సూట్ వేసుకొని పానీపూరి అమ్ముతున్న యువకులు.. కారణమేంటో తెలిస్తే షాకే..

పానీపూరి అంటే ఇష్టపడని వారుండరు. మన దేశంలో పానీపూరికి.. చాట్ ప్రియులు ఎందరో ఉన్నారు. ఈ రెండింటికి ప్రత్యేకమైన స్థానముంది.

Viral Video: సూట్ వేసుకొని పానీపూరి అమ్ముతున్న యువకులు.. కారణమేంటో తెలిస్తే షాకే..
Golgappa
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2022 | 9:18 PM

పానీపూరి అంటే ఇష్టపడని వారుండరు. మన దేశంలో పానీపూరికి.. చాట్ ప్రియులు ఎందరో ఉన్నారు. ఈ రెండింటికి ప్రత్యేకమైన స్థానముంది. పట్టణాల్లోనే కాదు. గ్రామాల్లోనూ పానీపూరి చాలా ఫేమస్. చిన్నా, పెద్ద తేడా లేకుండా వీటిని ఇష్టంగా తినేస్తుంటారు. ఇటీవల పానీపూరికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ తాజాగా ఓ వ్యక్తి అమ్మే పానీపూరి వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇక్కడ పానీపూరి స్పెషల్ కాదండోయ్.. అది అమ్మే యువకుడు. సాధారణ వ్యక్తిలా కాకుండా.. సూట్..షూస్ ధరించి పానీపూరి అమ్ముతున్నారు. ఇది చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అలా సూట్ ధరించి అమ్మడానికి గల కారణం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

సూట్ ధరించి పానీపూరి అమ్ముతున్న యువకుడు పంజాబ్ నివాసి. అతని వయస్సు 22 సంవత్సరాలు. రోడ్డు పక్కనే చాట్స్, పానీపూరి, దహీ భల్లాలను విక్రయిస్తున్నాడు. అయితే సూట్ ధరించి పానీపూరి అమ్మడంతో అతడిని అందరు ఆశ్చర్యంగా చూశారు. ఇటీవల యూట్యూబర్, ఫుడ్ వ్లాగర్ హ్యారీ ఉప్పల్ ఈ దుకాణాన్ని సందర్శించి వీడియోను తీసి యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఆ యువకుడు సూటు ధరించి పానీపూరి, చాట్‌లు ఎందుకు అమ్ముతున్నాడో వీడియోలో వివరించాడు. మార్చి 24న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 5 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందించారు. అయితే అతను అలా సూట్, షూస్ ధరించి పానీపూరి అమ్మడానికి గల కారణాన్ని తెలిపాడు.. అతను హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేశానని..అందుకే అలా పానీపూరి విక్రయిస్తున్నట్లు తెలిపాడు.

Also Read: Ramarao On Duty: బుల్ బుల్ తరంగ్ అంటూ రాబోతున్న మాస్ మహారాజా.. రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్..

Rajamouli: ఆమిర్ ఖాన్ మా అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..

RGV: మరో ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. డేంజరస్ సినిమాపై షాకింగ్ నిర్ణయం..

Ram Gopal Varma: వర్మను రాముడితో పోలుస్తూ పద్యం రాసిన రచయిత.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్జీవీ..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!