AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggareddy: ఆహ్వానం అందితే అటెండ్ అవుతా.. రేవంత్ పాదయాత్రపై జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టెర్రరిస్టు విధానాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆ పార్టీ ఎమ్మె్ల్యే, ముఖ్య నేత జగ్గారెడ్డి అన్నారు. ఆ వ్యతిరేకత కారణంగానే దేశ భద్రత కోసం తీసుకున్న చర్యల కారణంగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారన్నారు....

Jaggareddy: ఆహ్వానం అందితే అటెండ్ అవుతా.. రేవంత్ పాదయాత్రపై జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Jaggareddy
Ganesh Mudavath
|

Updated on: Feb 10, 2023 | 2:38 PM

Share

టెర్రరిస్టు విధానాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆ పార్టీ ఎమ్మె్ల్యే, ముఖ్య నేత జగ్గారెడ్డి అన్నారు. ఆ వ్యతిరేకత కారణంగానే దేశ భద్రత కోసం తీసుకున్న చర్యల కారణంగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారన్నారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని, సోనియా గాంధీ నాయకత్వం లోని వైఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. పాదయాత్ర లు ఎవరైనా చేసుకోవచ్చన్న జగ్గారెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తానని చెప్పి స్టార్ట్ కూడా చేశారని తెలిపారు. తనను పాదయాత్రకు పిలిస్తే పాల్గొంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ నాయకుల భావన ప్రజలు క్షేమంగా ఉండాలనేనని, నక్సలైట్ల ఆలోచన కూడా ప్రజల కోసమేనని అన్నారు. కాంగ్రెస్.. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు అనేకం ఉన్నాయని జగ్గారెడ్డి అన్నారు.

కాగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం కలిశారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులతోనూ భేటీ ఆయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిసినట్లు జగ్గారెడ్డి అన్నారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకూ ఇదే విషయంపై వినతి పత్రాలు ఇచ్చానన్నారు. మియాపూర్‌ నుంచి సంగారెడ్డి మీదుగా మెట్రో రైలు సేవలు విస్తరించాలని, 550 మందికి దళితబంధు మంజూరు చేయాలని, మహబూబ్‌సాగర్‌ చెరువు అభివృద్ధికి రూ.200 కోట్లు ఇవ్వాలని, నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను పేదలకు కేటాయించాలని సీఎంను కోరినట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం