Cow Hug Day: ఆవుతో ఆలింగనమా.. ఎప్పటిలాగే ప్రేమికుల రోజా.. ఈసారి ఫిబ్రవరి 14న కొత్త టెన్షన్..
ఆవుతో ఆలింగనమా? ఎప్పటిలాగే ప్రేమికుల రోజా? ఫిబ్రవరి 14 ఈసారి కొత్త టెన్షన్ తీసుకొచ్చింది. పాశ్చత్య సంస్కృతి వద్దు, వాలెంటైన్ డే రోజున కౌ హగ్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. మరి ప్రేమికులు ఆ రోజు పార్కులు వదిలి గోశాలు సందర్శించి ఆవులకు హగ్స్ ఇస్తారా? లేదంటే ఎప్పటిలాగే పార్కుల్లో పరవశించిపోతారా?

వాలెంటైన్స్ డే వద్దు – ఆవులకిద్దాం ఒక హగ్గు అంటూ కేంద్ర జంతు సంక్షేమ బోర్డు పిలుపుకు మంచి స్పందన లభిస్తోంతోంది. కౌ హగ్‌ను సమర్థించే వాళ్లు దాంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఆవును ఆలింగనం చేసుకుంటే ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఫారిన్‌లో ఇప్పటికే ఈ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. కౌ హగ్‌కు వాళ్లు కౌ థెరపీ అని పేరు పెట్టారు. ఆవును ఆలింగం చేసుకుంటే మనిషిలో ఒత్తిడి దూరమై ప్రశాంతత దొరుకుతుందని కొందరు డాక్టర్లూ అంటున్నారు. నెదర్లాండ్‌లో ఈ కల్చర్ దాదాపు 15 ఏళ్లుగా ఉంది. నెదర్లాండ్స్‌లోని రీవర్ ప్రాంతంలో ఈ కౌ హగ్గింగ్ థెరపీ మొదలైంది.
ఇక్కడ ఒక జంట తమ ఫామ్ హౌస్‌లో వెల్‌నెస్ సెంటర్ పెట్టి ఆవులను ఆలింగనం చేసుకోవాలని ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఆవులోని వేడి ఉష్ణోగ్రత, వాటి హృదయస్పందన మనిషి శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలకు ప్రేరేపిస్తాయని ఈ జంట చెప్తోంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుందని అంటున్నారు. ఈ తరహా కౌ హగ్గింగ్ వెల్‌నెస్ సెంటర్లు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నాయి. చాలా మంది ఆవును హగ్ చేసుకొని ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.




గోమాతకున్న ప్రాధాన్యతను గుర్తించండి, ఆవును ఆలింగనం చేసుకుంటే జీవితం సంతోషభరితం మారి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా సర్క్యూలర్‌లో పేర్కొంది. బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులందరూ కౌ హగ్ డేను స్వాగతించారు. ఆవును ఆలింగనం చేసుకోవడం ద్వారా అన్నదాతతో అనుసంధానం కావచ్చని కొందరు నాయకులు అంటున్నారు. ఆవును పూజించే సంప్రదాయం మనదని అంటున్నారు.
Move-over #ValentinesDay, Celebrate February 14 as #CowHugDay says- Animal Welfare Board of India pic.twitter.com/g5Nd8O1Djw
— ashok bagriya (@ashokbagriya10) February 8, 2023
ఆవును తల్లిగా భావించి పూజించే ఆచారం అనాది నుంచి భారతదేశంలో ఉంది. ఆవు ఇంట్లో ఉన్నా, గోశాలకు వెళ్లి వాటిని దర్శించుకొని పూజలు చేస్తే సుఖశాంతులు కలుగుతాయని భారతీయులు నమ్ముతారు. మోడ్రన్ ఏజ్ చాలా మంది దీన్ని కొట్టిపారేస్తారు.
విపక్షాలు మాత్రం ఈ పిలుపును తప్పుబడుతున్నాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కౌ హగ్ డే అంటూ ప్రచారం చేస్తున్నారని తృణమూల్ నేతలు భగ్గుమంటున్నారు.
ఆవు ఆలింగనం కేరళలో రాజకీయ దుమారానికి కారణమైంది. కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వంతో పోల్చితే ఆవులు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ విమర్శించారు. మరో వైపు ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా కాకుండా కౌ హగ్ డేగా జరుపుకోవాలన్న పిలుపుపై ఇంటర్నెట్‌లో ఫన్నీ మేమ్స్ పుట్టుకొచ్చాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం




