AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో మిస్సింగ్.. ఏపీలోని బావిలో డెడ్‌బాడీ.. ఇన్‌స్టా రీల్‌తో

హైదరాబాద్‌లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ ఆచూకీ పోలీసుల దర్యాప్తుతో కాకుండా కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ కావడంతో బయటపడింది. అయితే అప్పటికే ప్రకాశం జిల్లాలోని ఓ పాడుబడ్డ బావిలో అతని మృతదేహం లభించడం విషాదాన్ని మిగిల్చింది.

హైదరాబాద్‌లో మిస్సింగ్.. ఏపీలోని బావిలో డెడ్‌బాడీ.. ఇన్‌స్టా రీల్‌తో
Ankam Rahul
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 3:34 PM

Share

హైదరాబాద్‌లో అదృశ్యమైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆచూకీ పోలీసుల దర్యాప్తుతో కాదు.. కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ కావడంతో బయటపడింది. అయితే అప్పటికే ఆ విద్యార్థి మృతదేహం ఆంధ్రప్రదేశ్‌లోని ఓ బావిలో లభించడం విషాదాన్ని మిగిల్చింది. జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాహుల్ (21) హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఉన్న ఎంవీఎస్‌ఆర్ (MVSR) ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. మే 27 నుంచి రాహుల్ కనిపించకుండా పోవడంతో, మే 31న కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రాహుల్ తండ్రి అంకం రాజేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 30న తన కుమారుడి స్నేహితుడు ఆకాశ్ ఫోన్ చేసి రాహుల్ కనిపించడం లేదని చెప్పాడు. వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన మొదట సైదాబాద్ పోలీసులను ఆశ్రయించగా, చివరిసారిగా రాహుల్ కాచిగూడ ప్రాంతంలో కనిపించడంతో కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అనంతరం అక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, రాహుల్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. వెళ్లే ముందు తాను స్నేహితులతో బయటకు వెళ్తున్నానని మరో స్నేహితుడికి చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాహుల్ కోసం కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్ వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ వ్యక్తి జూన్ 4న కుటుంబానికి ఫోన్ చేసి, కొన్ని రోజుల క్రితం అక్కడ ఓ పాడుబడ్డ బావిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభించిందని సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లగా, అప్పటికే మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి ఖననం చేసినట్లు తెలిసింది. అనంతరం రాహుల్ తల్లి డీఎన్‌ఏ నమూనాలను పరీక్షించగా, బావిలో లభించిన మృతదేహం రాహుల్‌దేనని నిర్ధారణ అయింది. రాహుల్ మరణానికి ముందు ఓ యువతి విషయంలో కొందరు విద్యార్థులు అతడిని బెదిరించారని, వారి పాత్రపై తమకు అనుమానాలు ఉన్నాయని రాహుల్ తండ్రి ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని పేర్కొంటూ, కేసును సీబీఐతో విచారణ చేయించాలని తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
హైదరాబాద్‌లో అదృశ్యం.. కట్ చేస్తే ఏపీలోని ఓ బావిలో...
హైదరాబాద్‌లో అదృశ్యం.. కట్ చేస్తే ఏపీలోని ఓ బావిలో...
ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫ్రాన్స్ ఔట్.. రణరంగంగా మారిన పారిస్ వీధులు
ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫ్రాన్స్ ఔట్.. రణరంగంగా మారిన పారిస్ వీధులు
ఇండియన్ రైళ్లలో అత్యధికంగా దొంగతనానికి గురయ్యే వస్తువులు ఇవే!
ఇండియన్ రైళ్లలో అత్యధికంగా దొంగతనానికి గురయ్యే వస్తువులు ఇవే!
మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏..
మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏..
వాట్సాప్‌లో వచ్చిన రైలు టికెట్ చెల్లుతుందా?.. ప్రయాణికులకు అలర్ట్
వాట్సాప్‌లో వచ్చిన రైలు టికెట్ చెల్లుతుందా?.. ప్రయాణికులకు అలర్ట్
కలలో మండుతున్న అగ్ని కనిపించిందా?... ఇవి గొప్ప శుభ సంకేతాలు!
కలలో మండుతున్న అగ్ని కనిపించిందా?... ఇవి గొప్ప శుభ సంకేతాలు!
ముద్రగడ పద్మనాభం విలక్షణ నిర్ణయాలు
ముద్రగడ పద్మనాభం విలక్షణ నిర్ణయాలు
విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్
విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్
కొత్త వెబ్‌సైట్‌.. ఒక్క క్లిక్‌తోనే ఖాళీ సీట్లను గుర్తించవచ్చు
కొత్త వెబ్‌సైట్‌.. ఒక్క క్లిక్‌తోనే ఖాళీ సీట్లను గుర్తించవచ్చు
హోటల్ రూమ్స్‌లో బాత్రూమ్‌లకు గ్లాస్ గోడలు ఎందుకు పెడతారో తెలుసా?
హోటల్ రూమ్స్‌లో బాత్రూమ్‌లకు గ్లాస్ గోడలు ఎందుకు పెడతారో తెలుసా?