AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: ప్రతి ఎపిసోడ్ ట్విస్టులే.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏లో రఫ్పాడిస్తుంది..

కొన్నాళ్లుగా ఓటీటీలలో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ సిరీస్ ప్రతి ఎపిసోడ్ మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈ సిరీస్ అస్సలు మిస్ కాకండి. ఇంతకీ ఆ సిరీస్ పేరెంటో తెలుసా.. ?

Cinema OTT: ప్రతి ఎపిసోడ్ ట్విస్టులే.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏లో రఫ్పాడిస్తుంది..
Taskaree Movie
Rajitha Chanti
|

Updated on: Jul 15, 2026 | 3:25 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతి క్షణం ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలతో సాగిపోయే చిత్రాలు చూడాలనుకునేవారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ సిరీస్ పేరు టస్కరీ. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లి్క్స్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ దూసుకుపోతుంది. ఓటీటీలో విడుదలైన వెంటనే ఇది నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలిచింది. కిడ్నాప్ మాఫియా, పోలీసుల దర్యాప్తు, రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ భావాలు, ఊహించని మలుపులతో, ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను కథలోకి లాగేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

ఈ సిరీస్ కథ అక్రమ రవాణా చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. దేశ సరిహద్దులను దాటి విస్తరించి ఉన్న ఒక భారీ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించడానికి రంగంలోకి దిగిన ఒక నిజాయితీపరుడైన అధికారి ప్రయాణమే ఈ కథ ప్రధాన అంశం. ఈ అక్రమ రవాణా మాఫియా, దాని వెనుక ఉన్న పలుకుబడిగల వ్యక్తులు, కథలోని మలుపులే ఈ సిరీస్‌ను వేగంగా ముందుకు నడిపిస్తాయి. ప్రతి ఎపిసోడ్ ఒక మలుపుతో ముగుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్సుకతను పెంచుతూ, ప్రేక్షకులు చివరి వరకు చూడాలని కోరుకునేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. యాక్షన్ తో నిండిన పోరాట సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భావోద్వేగభరితమైన కుటుంబ సన్నివేశాలతో ఈ సిరీస్ బలంగా ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించారు. తన అద్భుతమైన నటనతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అదేవిధంగా, విలన్‌గా నటించిన శరద్ కూడా దృష్టిని ఆకర్షిస్తారు. ఈ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి, ఒక్కో ఎపిసోడ్ 40-50 నిమిషాల నిడివి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సిరీస్‌ను చూడొచ్చు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Follow Us
మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏..
మళ్లీ మళ్లీ చూడాలనిపించే సిరీస్.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏..
వాట్సాప్‌లో వచ్చిన రైలు టికెట్ చెల్లుతుందా?.. ప్రయాణికులకు అలర్ట్
వాట్సాప్‌లో వచ్చిన రైలు టికెట్ చెల్లుతుందా?.. ప్రయాణికులకు అలర్ట్
కలలో మండుతున్న అగ్ని కనిపించిందా?... ఇవి గొప్ప శుభ సంకేతాలు!
కలలో మండుతున్న అగ్ని కనిపించిందా?... ఇవి గొప్ప శుభ సంకేతాలు!
ముద్రగడ పద్మనాభం విలక్షణ నిర్ణయాలు
ముద్రగడ పద్మనాభం విలక్షణ నిర్ణయాలు
విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్
విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్
కొత్త వెబ్‌సైట్‌.. ఒక్క క్లిక్‌తోనే ఖాళీ సీట్లను గుర్తించవచ్చు
కొత్త వెబ్‌సైట్‌.. ఒక్క క్లిక్‌తోనే ఖాళీ సీట్లను గుర్తించవచ్చు
హోటల్ రూమ్స్‌లో బాత్రూమ్‌లకు గ్లాస్ గోడలు ఎందుకు పెడతారో తెలుసా?
హోటల్ రూమ్స్‌లో బాత్రూమ్‌లకు గ్లాస్ గోడలు ఎందుకు పెడతారో తెలుసా?
లక్ష్మీ సినిమాలో వెంకటేశ్ చెల్లెలు గుర్తుందా..?
లక్ష్మీ సినిమాలో వెంకటేశ్ చెల్లెలు గుర్తుందా..?
వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన
వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం