తెలంగాణలో ఆ జిల్లా పేరు మార్పు.. మంత్రి చోరవతో కలెక్టర్ ఆదేశాలు..

ములుగు జిల్లా పేరు మార్పుకు కసరత్తు మొదలైంది. ఆ జిల్లాను సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా పేరు మారుస్తూ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. జిల్లాల విభజన సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి అనేక పోరాటాల ఫలితంగా ములుగు జిల్లా ఏర్పడింది. 9 మండలాలతో కూడిన ఈ అడవుల జిల్లా ఓ చారిత్రక జిల్లాగా ఏర్పడింది. ఆరంభం నుండి ఈ జిల్లాను సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా ఏర్పాటు చేయాలని అనేక వినతులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి.

తెలంగాణలో ఆ జిల్లా పేరు మార్పు.. మంత్రి చోరవతో కలెక్టర్ ఆదేశాలు..
Minister Seetakka
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 02, 2024 | 10:46 AM

ములుగు జిల్లా పేరు మార్పుకు కసరత్తు మొదలైంది. ఆ జిల్లాను సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా పేరు మారుస్తూ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. జిల్లాల విభజన సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి అనేక పోరాటాల ఫలితంగా ములుగు జిల్లా ఏర్పడింది. 9 మండలాలతో కూడిన ఈ అడవుల జిల్లా ఓ చారిత్రక జిల్లాగా ఏర్పడింది. ఆరంభం నుండి ఈ జిల్లాను సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా ఏర్పాటు చేయాలని అనేక వినతులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. కానీ పేరు మార్పు ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు.

తాజాగా ములుగు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క ఒక అడుగు ముందుకు వేశారు. ములుగును సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా పేరు మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మంత్రి చొరవ ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ దినకర్ పేరు మార్పుకు చర్యలు మొదలు పెట్టారు. సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా పేరు మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 3వ తేదీ బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభలలో వారి అభ్యంతరాలు, సూచనలు తెలియపర్చవచ్చని సూచించారు. హిందీ, ఇంగ్లీష్ తెలుగు మూడు భాషలలో వారి అభ్యంతరాలు తెలియపరచాలి సూచించారు.

గ్రామసభ అనంతరం ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. గెజిట్‎లో ములుగుకు జిల్లా సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా ఆమోదముద్ర లభిస్తుంది. మేడారం సమ్మక్క సారక్క దేవతలు కొలువుదిరిన ఈ జిల్లాలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది. యూనేస్కో గుర్తింపుపొందిన రామప్ప దేవాలయం కూడా ఈ జిల్లాలోనే ఉంది. సమ్మక్క సారక్క దేవతల పేరు చెప్పగానే ములుగు జిల్లా గుర్తుకొస్తుంది. కాబట్టి సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా ఈ జిల్లా పేరును మార్చాలని స్థానిక ప్రజలు అనేకమార్లు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక మంత్రి సీతక్క చొరవతో ఎట్టకేలకు ఆ కల నెరవేరబోతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..