Edupayala Vana Durga: తెల్లనిపువ్వులతో ఏడుపాయల వన దుర్గకు అలంకరణ.. అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
మంగళవారం కావడంతో తెల్లవారుజామున ఏడుపాయల వనదుర్గభవాని అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, ప్రత్యేక పూజలు చేశారు. తెల్లని పూలు మల్లెపూలు, సన్నజాజులు ,లిల్లీలతో అమ్మవారిని పూజించడం వలన ఆరోగ్యం, మనశ్శాంతి, సంతానం కలుగుతుందనీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు పార్థివ శర్మ తెలిపారు.
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన ఏడుపాయల వనదుర్గభవాని అమ్మవారు ధవళవర్ణంతో దర్శనం ఇచ్చారు. అమ్మవారిని ఆలయ అర్చకులు మల్లెపూలు, సన్నజాజులు, లిల్లిలతో విశేషమైన అలంకరణ చేశారు. ఆ తెల్లన్ని పూల అలంకరణలో చల్లని చూపులతో దర్శనం ఇస్తున్న అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాల్సిదే ఎవరైనా… నేడు మంగళవారం కావడంతో తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, ప్రత్యేక పూజలు చేశారు.
తెల్లని పూలు మల్లెపూలు, సన్నజాజులు ,లిల్లీలతో అమ్మవారిని పూజించడం వలన ఆరోగ్యం, మనశ్శాంతి, సంతానం కలుగుతుందనీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు పార్థివ శర్మ తెలిపారు. మరో వైపు తెల్లవారుజాము నుంచే మంజీరా నదిలో స్నానమాచరించి భక్తులు అమ్మవారినీ దర్శించుకుని మొక్కులు చెల్లించు కుంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని అధ్యత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..