Watch Video: మైకంలో చెలరేగిపోతున్న పోకిరీలు.. సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్..

వరంగల్‎లో పోకిరీల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. గంజాయి మత్తులో అమాయకులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్న పోకిరీలు పోలీసులను సైతం లైట్ తీసుకుంటున్నారు. అలాంటి ఆకతాయిలకు కొంతమంది నాయకులు వత్తాసు పలకడంతో పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించక తప్పడం లేదు. తాజాగా ఓ కాలనీలో జరిగిన దాడి దృశ్యాలు స్థానికులు హడలెత్తి పోయేలా చేశాయి. ఓ యువకుడుపై మూకుమ్మడి దాడి దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది.

Watch Video: మైకంలో చెలరేగిపోతున్న పోకిరీలు.. సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్..
Warangal
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 02, 2024 | 10:30 AM

వరంగల్‎లో పోకిరీల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. గంజాయి మత్తులో అమాయకులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్న పోకిరీలు పోలీసులను సైతం లైట్ తీసుకుంటున్నారు. అలాంటి ఆకతాయిలకు కొంతమంది నాయకులు వత్తాసు పలకడంతో పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించక తప్పడం లేదు. తాజాగా ఓ కాలనీలో జరిగిన దాడి దృశ్యాలు స్థానికులు హడలెత్తి పోయేలా చేశాయి. ఓ యువకుడుపై మూకుమ్మడి దాడి దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది.

ఈ దాడి సంఘటన వరంగల్‎లోని చెన్నారెడ్డి కాలనీలో జరిగింది. ఓ యువకుడిపై కొందరు పోకిరీలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అంతా చూస్తుండగానే విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గరీబ్ నగర్‎కు చెందిన యువకుడు చెన్నారెడ్డి కాలనీలోని తన బంధువుల ఇంటికి బైక్‎పై వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా కొందరు పోకిరీలు వాహనాలు నిలుపుకొని ఉన్నారు. వారితో ఈ యవకుడికి మధ్య మాటా మాటా పెరిగింది. విచక్షారహితంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఆపే ప్రయత్నం చేస్తే వారిపై కూడా దాడికి తెగబడ్డారు.

దీంతో సదరు యువకుడి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన మిల్స్ కాలనీ పోలీసులు యువకుడిని ఎంజీఎం ఆస్పత్రికి పంపి వెళ్లిపోయారు. చికిత్స పొందిన యువకుడు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన యువకుల బంధువులు అధికార పార్టీకి చెందిన డివిజన్ నేతకు సన్నిహితులు కావడంతో కేసు కాకుండా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇంత గొడవ జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే స్థానిక నాయకులు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నగరంలో యువకులు గంజాయి మత్తుకు బానిసలుగా మారి ఇలాంటి దాడులకు పాల్పపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై ఎదురుదాడి చేస్తున్నారని వాపోతున్న స్థానికులు ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..