సారూ మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం..

విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో మమేకమవుతారు. వారితో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. టీచర్లతో పెనవేసుకున్న ఆ బంధం దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా ముద్దాడ బాలరాజు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీల్లో మండలంలోని కొత్త తండాకు బాలరాజు బదిలీ అయ్యాడు.

School Teacher
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 02, 2024 | 9:47 AM

విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో మమేకమవుతారు. వారితో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. టీచర్లతో పెనవేసుకున్న ఆ బంధం దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా ముద్దాడ బాలరాజు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీల్లో మండలంలోని కొత్త తండాకు బాలరాజు బదిలీ అయ్యాడు.

టీచర్ బదిలీపై వెళ్తున్న వేళ విద్యార్థులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్నేళ్లుగా తమ ఉన్నతికి తోడ్పాటు అందించి ప్రేమానురాగాలు పంచిన ఉపాధ్యాయుడు తమను వదిలి వెళ్లొద్దంటూ వేడుకున్నారు. తమతో కలిసి భోజనం చేసిన టీచర్ బాలరాజుకు విద్యార్థులంతా తమ చేతితే భోజనం తినిపించి ప్రేమను చాటుకున్నారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని తాను ఎక్కడ ఉన్నా మీ మంచిని కాంక్షిస్తానని అవసరమైన తోడ్పాటు అందిస్తానని చెప్పి విద్యార్థులను ఓదార్చారు. విద్యార్థులు తనపై చూపిన అభిమానాన్ని ఉద్వేగ క్షణాలను చూసి ఒక దశలో సదరు ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి గురై కన్నీళ్ళు పెట్టుకున్నాడు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నడుమ ఉన్న ఆప్యాయత గ్రామస్థులు, తల్లిదండ్రులను కట్టిపడేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెదిరించి తీసుకువెళ్లాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన యువతి

మాంసాహారం లేనిదే ముద్ద దిగదా..! ఈ సీజన్‌లో ఈ ఆహారం తినొద్దు

కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..

టార్చ్ లైట్ పట్టుకొని జనమే వస్తారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు..

గుప్త నవరాత్రులు చేస్తున్నారా కలశ ఏర్పాటు చేయడంలో నియమాలు ఏమిటంటే

లడ్డూ కౌంటర్‎లో అక్రమాలు.. ఉద్యోగులపై ఈవో సస్పెన్షన్ వేటు..

జామ పండ్లతోనే కాదు.. ఆకులలో కూడా ఔషధ గుణాలు.. తెలిస్తే ఆశ్చర్యమే!

మత్తుమందు ఇచ్చి కారులో రేప్ చేసిన తోటి ఉద్యోగులు

పూరీ ఆలయమే కాదు.. రథయాత్రలో కూడా ఎన్నో అద్భుతాలు..