Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బిజీబిజీగా సీఎం రేవంత్.. ఆ సమావేశం తరువాత మరోసారి ఢిల్లీ పెద్దలతో భేటి..

తెలంగాణలో ఈ నెల 4న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జూలై 3న మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపినటప్పటికీ రేపు జరగబోయే భేటీలో ఎవరికి ఏఏశాఖలు కేటాయించాలన్న అంశంపైకూడా తీవ్రమైన కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రేపటి ఢిల్లీ పర్యటనలో మంత్రి పదవులు ఎవరికి కేటాయించాలన్నదానిఫై తుది నిర్ణయం అధికారికంగా వెలువడనుంది.

Telangana: బిజీబిజీగా సీఎం రేవంత్.. ఆ సమావేశం తరువాత మరోసారి ఢిల్లీ పెద్దలతో భేటి..
Cm Revanth Reddy
Srikar T
|

Updated on: Jul 02, 2024 | 9:11 AM

Share

తెలంగాణలో ఈ నెల 4న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జూలై 3న మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపినటప్పటికీ రేపు జరగబోయే భేటీలో ఎవరికి ఏఏశాఖలు కేటాయించాలన్న అంశంపైకూడా తీవ్రమైన కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రేపటి ఢిల్లీ పర్యటనలో మంత్రి పదవులు ఎవరికి కేటాయించాలన్నదానిఫై తుది నిర్ణయం అధికారికంగా వెలువడనుంది. దానిని బట్టి కేబినెట్ విస్తరణలో భాగంగా ఇప్పుడు కేటాయించిన వారికి శాఖలు కూడా మారే అవకాశం కనిపిస్తోంది. దీనిపై నిన్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణతో సీఎం రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కేబినెట్ విస్తరణ తరువాత బడ్జెట్ కూర్పుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. బడ్జెట్ అంశంపై చర్చించేందుకు ఇవాళ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం శాంతి కుమారి అన్ని శాఖల కార్యాలయాలకు సీఎం సమావేశంపై సమాచారం అందించారు. ముందుగా శాఖల వారీగా పనితీరుతో పాటు, బడ్జెట్ కూర్పుపై సమీక్షించించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఉన్నతాధికారుల సూచనలు తీసుకోనున్నారు. ఇలా అన్నిశాఖలపై సంపూర్ణమైన సమాచారంతో బడ్జెట్ రూపొందించి జూలై 23 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరిపేందుకు సిద్దమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. జూలై 22 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో.. ఆ మరుసటి రోజే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

వీటన్నింటిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా గడపనున్నారు. ముందుగా ఉదయం 11.30 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో ఏర్పాటు చేసిన పోలీస్ మీట్‎కు హాజరుకానున్నారు. అనంతరం భోజన విరామం తరువాత తిరిగి రాష్ట్ర సచివాలయానికి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్‎లో మధ్యాహ్నం 3.30కు నిర్వహించే అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏఏ శాఖల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారన్నది ఈ కీలక సమావేశం తరువాత తెలియనుంది. మొన్నటి వరకూ ఎన్నికల హాడావిడిలో భాగంగా పాలనపై ఫోకస్ పెట్టే అవకాశం లేకపోవడంతో నేడు జరిగే అన్ని శాఖల సమావేశంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..