Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంత్రి సత్యవతి రాథోడ్ కు చేదు అనుభవం.. సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ..

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు చేదు అనుభవం ఎదురైంది. ములుగు జిల్లా(Mulugu district) పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. మంత్రి వాహనం ముందు...

Telangana: మంత్రి సత్యవతి రాథోడ్ కు చేదు అనుభవం.. సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ..
Minister Satyavati Rathod
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 20, 2022 | 3:52 PM

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు చేదు అనుభవం ఎదురైంది. ములుగు జిల్లా(Mulugu district) పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. మంత్రి వాహనం ముందు నిరసన చేపట్టారు. దళితబంధు లబ్దిదారుల ఎంపికలో తమకు అన్యాయం చేశారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30 నిమిషాల పాటు మంత్రి సత్యవతి రాథోడ్ వాహనం ముందు బైఠాయించి, ఆందోళన చేశారు. ములుగు గడ్డ పై అడుగు పెట్టొద్దు అని నినాదాలు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ కాళ్లు పట్టుకున్నారు. దళితుల కోసం న్యాయం చేయాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ వేడుకున్నారు. ఎంపీ కవిత కార్యకర్తలకు ఏం చేశారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మంత్రులు ములుగు ఎమ్మెల్యే సీతక్క కు వత్తాసు పలకడం ఏంటని నిలదీశారు. రహస్య ఒప్పందాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా.. నిరసకారుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..