AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 14 Winner: కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌ 14లో కోటి రూపాయలు గెల్చుకున్న గృహిణి.. ‘ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోను’

కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌ 14లో అక్షరాల కోటి రూపాయలు గెల్చుకున్న మొదటి కంటెస్టెంట్‌గా గృహిణి కవితా చావ్లా (45) రికార్డు నెలకొల్పారు. గత ఏడాది కౌన్ బనేగా కరోడ్‌పతి గేమ్‌ షోలో పాల్గొన్న కవిత హాట్ సీట్‌ను చేరుకోలేక కన్నీటి..

KBC 14 Winner: కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌ 14లో కోటి రూపాయలు గెల్చుకున్న గృహిణి.. 'ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోను'
Kbc 14 Winner
Srilakshmi C
|

Updated on: Sep 21, 2022 | 6:11 AM

Share

Kaun Banega Crorepati 14 Winner: కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌ 14లో  మహారాష్ట్రకు చెందిన గృహిణి కవితా చావ్లా (45) అక్షరాల కోటి రూపాయలు గెల్చుకున్నారు. గత ఏడాది కౌన్ బనేగా కరోడ్‌పతి గేమ్‌ షోలో పాల్గొన్న కవిత హాట్ సీట్‌ను చేరుకోలేక కన్నీటి పర్యాంతమయ్యారు. గేమ్‌లో ఓడిన సందర్భంలో నిరాశకు గురై కన్నీరు కార్చితే, KBC హోస్ట్ అమితాబ్ బచ్చన్ తనలో మనోధైర్యాన్ని నింపినట్లు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గత ఏడాది మొదటి రౌండ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎంతో నిరాశ చెందానని, కేబీసీలో గెలవలేకపోయినందుకు చాలా మంది తనను ఎగతాళి చేసినట్లు, ‘కరోడ్‌పతి బ్యాన్ గయీ’ అంటూ వెక్కిరింపులు ఎదుర్కోవల్సి వచ్చిందని అన్నారు. కవిత తన ఇంటర్వ్యూలో అమితాబ్ గురించి ఈ విధంగా మాట్లాడారు..

‘గత ఏడాది హాట్‌ సీట్‌ చేరుకోకుండానే వెనుదిరిగాను. సెట్‌లో కూర్చుని బాధపడుతున్న సందర్భంలో అమితాబ్ బచ్చన్ జీ.. నా దగ్గరికి వచ్చి నన్ను డిమోటివేట్ అవ్వొద్దని ధైర్యం చెప్పారు. ఆ రోజు ఆయన అన్న మాటలు నా మనసులో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. గెలవాలనే లక్ష్యంతో తిరిగి షోకు రావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అనుకున్నట్లుగానే ఈ సారి విజయం సాధించాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అమితాబ్‌ వంటి గర్వం లేని వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఎంతో నిష్కపటంగా, స్వచ్ఛంగా మాట్లాడారు. ఈ షోలో అమితాబ్‌తో చాలా సరదాగా గడిపాను. చివర్లో అమిత్‌జీ నా దగ్గరకు వచ్చి ‘క్లవర్‌ గేమ్‌’ ఆడానని ప్రశంసిచారు. నా జర్నీలో ఇదే అత్యున్నతమైన ప్రశంస. 2000 సంవత్సరం నుంచి ఈ గేమ్‌ షోలో పాల్గొనాలని కలలు కన్నాను. గత ఏడాది ఈ షోకి వచ్చాను. ఐతే వేగంగా ఫింగర్ రౌండ్‌కి చేరుకోవడంతో, షో నుంచి వెనుదిరగవల్సి వచ్చింది. ఈ ఏడాది గేమ్‌లో గెలిచి నా కలను నెరవేర్చుకున్నాను. నా కొడుకును చదివించేటప్పుడు నేను కూడా పుస్తకాలు చదివేదాన్ని. అది చాలా ఉపయోగపడిందని తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కవిత.

ఇవి కూడా చదవండి

12వ తరగతి వరకు చదివిన కవిత మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఓ గృహిణి. ఆమె వ్యక్తిగత ప్రయాణం ఎన్నో సవాలుతో కూడుకున్నప్పటికీ కౌన్ బనేగా కరోడ్‌పతిలో విన్నర్‌గా సత్తా చాటారు. 10వ తరగతి పాస్‌ అయ్యాక చదువుకు స్వస్తి చెప్పిన కవిత.. ఆ తర్వాత కూడా చదువుకోవాలనే ఆసక్తితో 12వ తరగతి పూర్తి చేసింది. అనంతరం చదువుకు దూరం అయ్యింది. కుట్టు మిషన్‌ ద్వారా 8 ఏళ్లు పనిచేసి రోజుకు 20 సంపాదించేదానని ఇంటర్వ్యూలో తెలిపారు.