Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold smuggling: సినీ ఫక్కీలో గోల్డ్‌ స్మగ్లింగ్‌! ఖతర్నాక్ స్కెచ్‌.. ఐనా దొరికిపోయాడు..

బంగారాన్ని సినీ ఫక్కీలో అక్రమ మార్గంలో తరలించేందుకు ప్రయత్నించి ఓవ్యక్తి కటకటాల పాలయ్యాడు. దుబాయ్‌ నుంచి కిలోకు పైగా బంగారంను అక్రమంగా తరలిస్తూ ..

Gold smuggling: సినీ ఫక్కీలో గోల్డ్‌ స్మగ్లింగ్‌! ఖతర్నాక్ స్కెచ్‌.. ఐనా దొరికిపోయాడు..
Gold Smuggling
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 20, 2022 | 12:56 PM

Man tries to smuggle 1 kg gold in this way: బంగారాన్ని సినీ ఫక్కీలో అక్రమ మార్గంలో తరలించేందుకు ప్రయత్నించి ఓవ్యక్తి కటకటాల పాలయ్యాడు. దుబాయ్‌ నుంచి కిలోకు పైగా బంగారంను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నాలుగు క్యాప్సూల్స్‌లో బంగారంను ఉంచి శరీరంలో వివిధ ప్రదేశాల్లో దాచుకుని తరలిస్తున్న వ్యక్తిని కేరళలోని కరిపూర్ విమానాశ్రయంలో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడు కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా వరియంకోడ్‌కు చెందిన నౌఫల్ (36)గా గుర్తించారు. వివరాల్లోకెళ్తే..

నౌఫల్ (36) సోమవారం (సెప్టెంబర్ 19న) దుబాయ్ నుంచి కరిపూర్‌ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నాడు. 1.063 కిలోల బంగారాన్ని నాలుగు క్యాప్సూల్స్‌లో ఉంచి, వాటని ప్రైవేట్‌ పార్టులో చొప్పించి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. నైఫల్ కదలికలపై అనుమానం కలిగిన పోలీసులు అతని లగేజీని, శరీరాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం కొండొట్టిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎక్స్-రేలో అతని కడుపులో బంగారంతో ఉన్న నాలుగు క్యాప్సూల్స్ గుర్తించారు. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. గత కొన్ని నెలల్లో కరిపూర్ విమానాశ్రయంలో నమోదైన బంగారం స్మగ్లింగ్ కేసు ఇది 59 వది కావడం విశేషం.