Viral Video: వార్షిక ఎయిర్ రేస్ పోటీల్లో అగ్నికి ఆహుతైన విమానం.. కళ్లముందే పైలట్ సజీవ దహనం!

అమెరికాలోని నెవాడాలో జరుగుతున్న యానువల్‌ ఎయిర్ రేస్ పోటీల్లో అపశృతి నెలకొంది. చివరిరోజున నిర్వహిస్తున్న పోటీల్లో ఓ విమానానికి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించడంతో పైలట్‌ సజీవ దహనమయ్యాడు..

Viral Video: వార్షిక ఎయిర్ రేస్ పోటీల్లో అగ్నికి ఆహుతైన విమానం.. కళ్లముందే పైలట్ సజీవ దహనం!
Plane Crash
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 20, 2022 | 1:28 PM

Fiery Jet Crash During US Reno Air Races: అమెరికాలోని నెవాడాలో జరుగుతున్న యానువల్‌ ఎయిర్ రేస్ పోటీల్లో అపశృతి నెలకొంది. చివరిరోజున నిర్వహిస్తున్న పోటీల్లో ఓ విమానానికి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించడంతో పైలట్‌ సజీవ దహనమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. రెనో ఎయిర్ రేసెస్‌లో భాగంగా ఛాంపియన్‌షిప్ రౌండ్‌లో చివరి రోజైన ఆదివారం (సెప్టెంబర్‌ 18)నాడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జెట్ గ్లోడ్ రేస్ మూడవ ల్యాప్‌లో ఔటర్ పైలాన్ ఐదు వద్ద ఘోర ప్రమాదం సంభవించి.. ఫైలట్‌తో సహా విమానం పూర్తిగా దహనమయ్యింది. దీంతో మిగతా పైలట్లందరూ గ్రౌండింగ్ అయ్యారు. మరణించిన పైలట్ పేరును అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ద్వారా క్షుణ్ణంగా దర్యాప్తు చేపడతామని, ఈ ఏవీలో పాల్గొన్న ఇతర పైలట్లలో ఎవ్వరికీ గాయాలు కాలేద, అందరూ సురక్షితంగా ఉన్నారని రేస్ ఛైర్మన్ ఫ్రెడ్ టెల్లింగ్ మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే చివరి రోజున నిర్వహించవల్సిన మిగతా ఈవెంట్లన్నింటినీ రద్దు చేశారు. కాగా రెనో ఎయిర్ రేస్‌లు ఏటా సెప్టెంబర్‌లో నెవాడాలోని రెనో స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌లో జరుగుతాయి. ఈ ఈవెంట్‌లో బైప్లేన్స్‌, జెట్ ప్లేన్స్‌ వంటి వివిధ విమానాల మధ్య పోటీలు నిర్వహిస్తారు.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ