AP Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. వివిధ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు , రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 22వ తేదీ) వరకూ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
AP Weather Alert: సోమవారం ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంపై ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి , ఎత్తు కు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిరానున్న రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఏపీలో రానున్న మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు , రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 22వ తేదీ) వరకూ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు ౩౦ నుండి 40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని పేర్కొంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు , రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 22వ తేదీ) మూడు రోజుల పాటు ఏపీలో వివిధ ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు ౩౦ నుండి 40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.
రాయలసీమ: ఈరోజు , రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 22వ తేదీ) మూడు రోజుల పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు ౩౦ నుండి 40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..