AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. శాస్త్రోక్తంగా మృత్యుంజయ హోమం నిర్వహించిన మంత్రి..

ముఖ్యమంత్రి కేసీఆర్  ఇటీవల అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. నీరసం, చేతి నొప్పితో యశోదా ఆస్పత్రికి వచ్చిన సీఎంకు డాక్టర్ల బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. శాస్త్రోక్తంగా మృత్యుంజయ హోమం నిర్వహించిన మంత్రి..
Mrityunjaya Homam
Basha Shek
|

Updated on: Mar 14, 2022 | 12:32 PM

Share

ముఖ్యమంత్రి కేసీఆర్  ఇటీవల అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. నీరసం, చేతి నొప్పితో యశోదా ఆస్పత్రికి వచ్చిన సీఎంకు డాక్టర్ల బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. కాగా హఠాత్తుగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌ (CM KCR) త్వరగా కోలుకోవాలని గవర్నర్‌తో సహా అన్ని పార్టీల నేతలు ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. మంత్రుల క్వార్టర్స్‌లో వేద పండితుల మధ్య శాస్త్రోక్తంగా ఈ హోమం జరిపారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సురభి వాణీ దేవి, తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ఈ హోమంలో పాల్గొన్నారు.

టీఆర్ఎస్‌ నాయకుల ప్రత్యేక పూజలు..

అంతకుముందు సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఈ హోమాన్ని జరిపించారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌లోని అబ్దుల్‌ ఖాదర్‌ దర్గాలో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ చాదర్‌ సమర్పించారు.

Also Read:Cheapest Electric Car: ఎలక్ట్రిక్ కార్ ప్రియులకు శుభవార్త.. అత్యంత తక్కువ ధరలో MG E230..

Viral: ఉద్యోగం వదిలేసి పార్శిల్ సర్వీస్ ప్రారంభించిన యువతి.. ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

వేసవిలో పెదవుల సంరక్షణ కోసం కొన్ని ప్రత్యేక నియమాలు మీ కోసం…