Singareni: సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌.. ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా కార్మికుల ఆందోళన..

సింగరేణిలో సమ్మె సైరన్‌ మోగింది. ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మెకు దిగుతున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి.

Singareni: సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌.. ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా కార్మికుల ఆందోళన..
Singareni Mines
Follow us

|

Updated on: Mar 14, 2022 | 2:15 PM

సింగరేణిలో సమ్మె సైరన్‌ మోగింది. ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మెకు దిగుతున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈమేరకు సింగరేణి యాజమాన్యానికి కార్మిక సంఘాలు AITUC, INTUC, HMS, CITU సమ్మె నోటీసులు ఇచ్చాయి. సింగరేణి బొగ్గు బ్లాకులను వేళం ద్వారా ప్రైవేట్‌వాళ్లకు అప్పగించడానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. కార్మిక చట్టాల్లో సంస్కరణలను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించారు. రాజకీయంగాను టీఆర్ఎస్, బీజేపీ మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామంటున్న కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధపడ్డాయి.

సింగరేణిలో 4 కోల్ బ్లాక్స్ ను ప్రైవేటీకరించేందుకు, వేలం వేయడానికి కేంద్రం సిద్దమైన నేపథ్యంలో కార్మికులు దీన్ని వ్యతిరేకిస్తు సమ్మెకు వెళ్తున్నారు. నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్య గూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటికరించడాన్ని కార్మికులు వ్యతిరేఖిస్తున్నారు. కేంద్రం ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. దీనిపై టీాఆర్ఎస్ సర్కార్ కూడా కేంద్రం తీరుపై ఫైర్ అవుతోంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేఖిస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తే తమ సత్తా చూపిస్తాం అంటూ కేంద్రానికి వార్నింగ్ ఇస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో ప్రైవేటీకరణ కు వ్యతిరేఖంగా మూడు రోజులు సమ్మెకు వెళ్లారు కార్మికులు. డిసెంబర్ 9 నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేసి తమ నిరసన తెలిపారు.

ఇవి కూడా చదవండి: Telangana: మంత్రి కావాలన్న ఆయన కల కలేనా..? సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయంతో శాస‌న మండ‌లి చైర్మన్‌గా మళ్లీ..