Viral: ఉద్యోగం వదిలేసి పార్శిల్ సర్వీస్ ప్రారంభించిన యువతి.. ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఫ్యూజులు ఔట్!
కొంతమంది తమకు వచ్చే జీతం సరిపోకపోతే.. పార్ట్ టైం జాబ్ చేస్తూ బ్రతుకు జట్కా బండిని సాగిస్తుంటారు. సమయాన్ని..
కొంతమంది తమకు వచ్చే జీతం సరిపోకపోతే.. పార్ట్ టైం జాబ్ చేస్తూ బ్రతుకు జట్కా బండిని సాగిస్తుంటారు. సమయాన్ని వృధా చేయకుండా ఎక్కువ డబ్బు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. టీచర్ ఉద్యోగం చేసేవారు.. పార్ట్ టైం జాబ్ కింద పిల్లలకు ట్యూషన్లు చెబితే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు.. పార్ట్ టైంగా కోడింగ్ చేస్తుంటారు. జేబులు నింపుకునేందుకు ఇలా ఎవరి కష్టం వారిది.. అయితే ఫుల్ టైం జాబ్ కంటే.. పార్ట్ టైమ్ చేసే ఉద్యోగానికే ఎక్కువ డబ్బులు వస్తే.?
అవునండీ.! మీరు విన్నది నిజమే.. ఇంగ్లాండ్‌లోని వెస్ట్ ససెక్స్‌లో నివసిస్తున్న అట్లాంటా మార్టిన్.. తన ఆదాయాన్ని పెంచుకునేందుకు పార్ట్‌టైమ్ జాబ్‌లో జాయిన్ అయింది. మొదటిగా తన జీతానికి.. ఈ పార్ట్ టైం ఉద్యోగం సహాయపడుతుందని భావించిన ఆమె.. అతి కొద్దిరోజుల్లోనే పార్ట్ టైం వర్క్ నుంచి ఎక్కువ సంపాదనను ఆర్జించడం మొదలు పెట్టింది. దీనితో ఆమె తన ఫుల్ టైం ఉద్యోగానికి స్వస్తి పలికి.. పార్ట్ టైం జాబ్‌పై ఫోకస్ పెట్టింది.
21 ఏళ్ల అట్లాంటా మార్టిన్.. బ్రిటన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో ఫ్లైట్ డిస్పాచర్‌గా పని చేసేది. వచ్చేది చాలిచాలనంత జీతం కావడంతో.. తన ఆదాయాన్ని పెంచుకోవడానికి, అట్లాంటా పార్ట్ టైంగా పార్శిల్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది. జూలై 2019లో, ఆమె పార్శిళ్ల డెలివరీ ద్వారా లక్షల్లో సంపాదన ఆర్జించింది. దీనితో ఆమె తన ఉద్యోగానికి స్వస్తి పలికింది. పార్శిళ్ల డెలివరీ ద్వారా ఆమె ఆదాయం రోజురోజుకూ పెరుగుతూపోయింది. ఆమె రోజుకు 50 డెలివరీలు చేస్తే.. వారానికి ఆమె సంపాదన లక్షల్లో ఉండేది. ప్రస్తుతం, మార్టిన్ తన పార్శిల్ సర్వీస్‌ను జస్ట్ ఈట్, ఉబర్ ఈట్స్, డెలివరూ(Deliveroo), బీలివరీ(Beelivery)లకు అందిస్తోంది.