Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabitha Indra Reddy: అవన్నీ పుకార్లే.. పాఠశాలలకు సెలవంటూ వస్తున్న వార్తలపై మంత్రి కీలక ప్రకటన..

తెలంగాణలో పాఠశాలలకు సెలవంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు..

Sabitha Indra Reddy: అవన్నీ పుకార్లే.. పాఠశాలలకు సెలవంటూ వస్తున్న వార్తలపై మంత్రి కీలక ప్రకటన..
Sabitha Indra Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 01, 2021 | 2:41 PM

తెలంగాణలో పాఠశాలలకు సెలవంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించారని గుర్తు చేశారు. సోషల్‌ మీడియాతో జరుగుతున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మొద్దన్నారు. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్‌ కట్టడి చేద్దాం అంటూ మంత్రి పిలుపునిచ్చారు. అదే సమయంలో విద్యా సంస్థల యాజమాన్యాలు సైతం అన్ని విధాలా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి  తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

తన ట్విట్టర్ వేదిగా.. “కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దన్నారు.”

కరోనా నిబంధనలు తప్పనిసరి.. అన్ని విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగ్గా పాటించాలని, పాఠశాల గదులన్ని శానిటైజ్‌ చేయాలని, థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొన్ని విద్యాసంస్థలు కరోనా నిబంధనలు పాటించడం లేదని సమాచారం ఉందని, అలా నిర్లక్ష్యం చేసినట్లయితే విద్యాసంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. థర్డ్‌వేవ్‌ ముప్పు ఉన్నందున ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా కోవిడ్‌పై జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులను అప్రమత్తం చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి: Sirivennela Sitarama Sastri: జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి సిరివెన్నెల..

Green Peas Benefits: బఠానీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..