మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పువ్వాడ.. రూ.35 లక్షల చెక్కులు, ఉద్యోగ నియామక పత్రం అందజేత..
Khammam: లాకప్‌లో చనిపోయిన ఖమ్మం జిల్లాకు చెందిన దళిత మహిళ అంబడిపూడి మరియమ్మ కుటుంబాన్ని సోమవారం నాడు మంత్రి..
Khammam: లాకప్‌లో చనిపోయిన ఖమ్మం జిల్లాకు చెందిన దళిత మహిళ అంబడిపూడి మరియమ్మ కుటుంబాన్ని సోమవారం నాడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. మరియమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మరియమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అజయ్ కుమార్.. మరియమ్మ మృతి అత్యంత బాధాకరం అని అన్నారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని మంత్రి స్పష్టం చేశారు. మరియమ్మ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేశారని పేర్కొన్నారు. ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్ కి రూ.15 లక్షల చెక్కు, ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేశారు. అలాగే.. ఆమె ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వం తరుపున చెరో రూ.10 లక్షలు మొత్తం రూ. 35 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అందజేశామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, అదనపు కలెక్టర్ మధుసూదన్, అదనపు డీసీపీ బోస్, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి కే సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.
కాగా, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంకు చెందిన దళిత మహిళ అంబడిపూడి మరియమ్మ పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణలో పెను సంచలనం సృష్టించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. అలాగే బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలించింది.
Also read:
Cholera Vaccine: బియ్యం పిండితో ‘కలరా’ పారద్రోలే టీకా.. జపాన్ శాస్త్రవేత్తల సరికొత్త సృష్టి!
Viral Video: వధూవరుల గుసగుసలు.. మైక్ ఆన్‌లో ఉందని తెలిసి వరుడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేరు.!