AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రానికి, ట్విట్టర్‌కి జరుగుతున్న వివాదంలో మరో ట్విస్ట్..! తాత్కాలిక గ్రీవెన్స్ అధికారి ధర్మేంద్ర చతుర్ రాజీనామా..

Twitter vs Central Government : గత కొన్ని రోజులుగా కొత్త ఐటీ నిబంధనల అమలు గురించి కేంద్ర ప్రభుత్వానికి, సామాజిక

కేంద్రానికి, ట్విట్టర్‌కి జరుగుతున్న వివాదంలో మరో ట్విస్ట్..! తాత్కాలిక గ్రీవెన్స్ అధికారి ధర్మేంద్ర చతుర్ రాజీనామా..
Twitter
uppula Raju
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 28, 2021 | 6:52 PM

Share

Dharmendra Chatur Resigns : గత కొన్ని రోజులుగా కొత్త ఐటీ నిబంధనల అమలు గురించి కేంద్ర ప్రభుత్వానికి, సామాజిక మాద్యమం ట్విట్టర్‌కి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విటర్‌ తాత్కాలిక గ్రీవెన్స్ అధికారి ధర్మేంద్ర చతుర్ రాజీనామా చేశారు. గ్రీవెన్స్ అధికారిగా నియమితుడైన ధర్మేంద్ర చతుర్‌ నెల తిరక్క ముందే ఆ బాధ్యతల నుంచి వైదొలగడం గమనార్హం. అయితే దీని గురించి ట్విట్టర్ స్పందించడం లేదు. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం యూజర్ల సంఖ్య 50 లక్షలు దాటితే సోషల్ మీడియా సంస్థలు ఫిర్యాదుల పరిష్కారానికి ఓ అధికారిని నియమించి, ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అందుకోసం తాత్కాలిక ఫిర్యాదుల అధికారిగా ధర్మేంద్ర చతుర్‌ను నియమించింది. ఇంకో ముఖ్య విషయమేమిటంటే నిబంధనల ప్రకారం సదరు అధికారి భారత్‌లో నివసించే వారై ఉండాలి.

అయితే ధర్మేంద్ర చతుర్‌ మూడు వారాల్లోనే తప్పుకున్నారు. దీంతో ట్విటర్‌లో ఫిర్యాదుల అధికారి అని ఉన్నచోట కంపెనీ పేరు, అమెరికా చిరునామాతో కూడిన ఈ-మెయిల్‌ ఐడీ కనిపిస్తున్నాయి. ట్విటర్‌కు ఇపుడు న్యాయపరమైన రక్షణ లేకుండా పోయిందని, వినియోగదారులు పోస్ట్‌ చేసే సమాచారం మొత్తానికి కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనిపై ట్విట్టర్ తక్షణమే స్పందించి సరియైన నిర్ణయం తీసుకోవాలి.

ఇదిలా ఉంటే ట్విట్టర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపుతూ.. భారత దేశ పటాన్ని వక్రీకరించింది. ఇప్పటికే నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా చర్యతో ఈ సంస్థ ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు ఎదుర్కోనుందని అధికార వర్గాలు అంటున్నాయి. ట్విటర్‌లోని ‘ట్వీప్‌ లైఫ్’ సెక్షన్‌లో.. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపలేదు. వాటిని వేరే దేశంగా పేర్కొంది. భూభాగాలను తప్పుగా గుర్తించిన భారతదేశ పటం నెటిజన్ల దృష్టిలో పడింది. దీనిపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో కూడా లేహ్‌ ప్రాంతాన్ని చైనాలో భాగంగా తప్పుగా గుర్తించిన సంగతి తెలిసిందే.

Read Also: Telegram Features: వాట్సాప్‌కు గ‌ట్టి పోటీనిచ్చే దిశ‌గా టెలిగ్రామ్ అడుగులు.. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో అప్‌డేట్‌..

Actress Kasturi: రజినీ కాంత్ అమెరికా టూర్ పై నటి కస్తూరి సంచలన కామెంట్స్.. క్లారిటీ కావాలంటూ..

Sweden Prime Minister: స్వీడన్ పార్లమెంట్‌లో విశ్వాసం కోల్పోయిన ప్రధాని.. తన పదవికి రాజీనామా