COVID-19 Vaccination: వ్యాక్సినేషన్‌లో అమెరికాను మించిన భారత్.. ఇప్పటివరకు 32 కోట్ల మందికి అందిన కోవిడ్ టీకా

వ్యాక్సినేషన్‌లో భారత్‌.. అమెరికాను మించిపోయింది. ఇప్పటి వరకు 32కోట్లకుపైగా డోసుల వ్యాక్సిన్లను ఇచ్చింది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం..

COVID-19 Vaccination: వ్యాక్సినేషన్‌లో అమెరికాను మించిన భారత్.. ఇప్పటివరకు 32 కోట్ల మందికి అందిన కోవిడ్ టీకా
Vaccination
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 28, 2021 | 4:57 PM

India’s COVID-19 Vaccination: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 46వేల 148 కేసులు నమోదయ్యాయి. DRDOతో కలిసి అభివృద్ధి చేసిన 2డీజీని ఇవాళ మార్కెట్‌లోకి విడుదల చేసింది డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌. గతంలో ప్రకటించినట్టుగానే ప్యాకెట్‌ ధరను రూ.990గా తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేట్లకే ఇస్తామంది. వ్యాక్సినేషన్‌లో భారత్‌.. అమెరికాను మించిపోయింది. ఇప్పటి వరకు 32కోట్లకుపైగా డోసుల వ్యాక్సిన్లను ఇచ్చింది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్‌ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

Covid Vaccine

Covid Vaccine

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 కోట్ల 17 లక్షల 60 వేల 077 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 26 కోట్ల 53 లక్షల 84 వేల 559 మందికి మొదటి డోస్‌ టీకా అందగా.. 5 కోట్ల 63 లక్షల 75 వేల 518 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇప్పటి వరకు 64 లక్షల 25 వేల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఇక, ఏయే వయసు వారు ఎంతమంది టీకా తీసుకున్నారోచూద్దాం..

HCWs 1st Dose 1,01,96,091
2nd Dose 72,00,994
FLWs 1st Dose 1,74,36,514
2nd Dose 93,79,246
Age Group 18-44 years 1st Dose 8,34,29,067
2nd Dose 18,56,720
Age Group 45-59 years 1st Dose 8,68,82,578
2nd Dose 1,46,35,430
Over 60 years 1st Dose 6,74,40,309
2nd Dose 2,33,03,128
Total 32,17,60,077

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేసుకునేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 49 లక్షల 6 వేల 162 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. కోటి 19 లక్షల 86 వేల 45 మందికి మొదటి డోస్‌ అందగా.. 29 లక్షల 20 వేల 117 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 4 లక్షల 79వేల 569 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్‌ పూర్తైన వారు 89 లక్షల 86 వేల 779 మంది కాగా.. రెండో డోస్‌ పూర్తైన వారు 14 లక్షల 92 వేల 790 మంది ఉన్నారు.

ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 28 కోట్ల 09 లక్షల 72 వేల 775 మందికి covisheild అందితే.. 3 కోట్ల 84 లక్షల 5 వేల 394 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 34 కోట్లు దాటింది. ఆ వివరాలు చూస్తే.. 34 కోట్ల 29 లక్షల 54 వేల 715 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 16 కోట్ల 12 లక్షల 75 వేల 241 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 18 కోట్ల 16 లక్షల 79 వేల 472 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

Covid Vaccine

Covid Vaccine

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి.. కరోనా మహమ్మారిని దరిచేరనివ్వకండి..

Read Also… AP Weather Report: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతంలో వర్షాలు పడే ఛాన్స్..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై