Minister KTR: తెలంగాణను శత్రు దేశంగా చూస్తున్నారు.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్..

సిరిసిల్ల పర్యటనలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. తెలంగాణతో కేంద్రంలో ఉన్న పార్టీకి రాజకీయ వైరుధ్యం ఉన్నా.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి అవార్డులు ఇవ్వక తప్పడం లేదంటున్నారు.

Minister KTR: తెలంగాణను శత్రు దేశంగా చూస్తున్నారు.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్..
Minister Ktr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 28, 2023 | 7:26 AM

తెలంగాణతో కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ వైరుధ్యం ఉన్నా రాష్ట్రానికి అవార్డులు ఇవ్వక తప్పడం లేదన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వరుసగా మూడుసార్లు దేశంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. తెలంగాణలో గ్రామాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు కేటీఆర్. ఒకప్పుడు బెస్ట్ గ్రామాలంటే ఎక్కడో కేరళలో ఉన్నాయని చెప్పే వారు. కాని నేడు ఐఏఎస్ అధికారులకు పాఠాలు చెప్పే స్థాయికి మన గ్రామాలు చేరుకుంటున్నాయన్నారు మంత్రి. తెలంగాణను కేంద్ర ప్రభుత్వం శత్రు దేశంగా చూస్తుందన్న కేటీఆర్.. ఒకవైపు అవార్డులు ఇస్తూనే మరోవైపు 1200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయకుండా వేధిస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధించి మరిన్ని అవార్డులు దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ జాతీయ పంచాయతీ అవార్డుల కార్యక్రమంలో వివరించారు.

అదానీ కోసం బొగ్గు పాలసీ తెస్తే యూపీ సీఎం యోగి కూడా వ్యతిరేకించారంటూ కేటీఆర్ గుర్తుచేశారు. అదానీ లాభాల కోసం విమానాశ్రయాలు, బొగ్గు గనులు కట్టబెడుతున్నారని విమర్శించారు. అదానీ ఇచ్చిన డబ్బులతో ప్రభుత్వాలను పడగొట్టాలి, దేశాన్ని అల్లకల్లోలం చేయాలన్న బీజేపీ ప్లాన్ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

గుజరాత్‌లో మోదీ పాలనలో 13 సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. ఎన్నిసార్లు మంత్రులు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ఎకరాకు 50 వేల రూపాయల పంటనష్ట పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ అంటున్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చి ఇస్తారా అంటూ బండి సంజయ్‌ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..