Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Revised Exam Dates: వాయిదా పడిన ఆ 5 పరీక్షలకు టీఎస్‌పీఎస్సీ కొత్త తేదీలు..! నేడో, రేపో స్పష్టత

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషన్‌ గ్రూప్‌ 1తోసహా పలు నియామక పరీక్షలు రద్దు చేసింది కూడా. ఐతే రద్దయిన పరీక్షల కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ నేడో, రేపో ప్రకటించనుంది..

TSPSC Revised Exam Dates: వాయిదా పడిన ఆ 5 పరీక్షలకు టీఎస్‌పీఎస్సీ కొత్త తేదీలు..! నేడో, రేపో స్పష్టత
TSPSC revised exam dates
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 28, 2023 | 8:02 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషన్‌ గ్రూప్‌ 1తోసహా పలు నియామక పరీక్షలు రద్దు చేసింది కూడా. ఐతే రద్దయిన పరీక్షల కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ నేడో, రేపో ప్రకటించనుంది. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల 4 పరీక్షలను రద్దు చేయగా.. రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పరీక్షలు రద్దయ్యాయి. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు కొత్త తేదీలపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని కమిషన్‌ ఇప్పటికే ఖరారు చేసింది. ఈ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

మిగతా రద్దయిన పరీక్షలతో పాటు వాయిదా పడిన వాటికి మంగళవారం అంటే ఈ రోజు లేదా రేపు (బుధవారం) కొత్త తేదీలు వెల్లడించే అవకాశాలున్నాయి. వీటిలో కొన్ని పోస్టుల రాతపరీక్షలను గతంలో ఓఎంఆర్‌ పద్ధతిలో కమిషన్‌ నిర్వహించింది. ఐతే తాజాగా ఈ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో (కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు) నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఏయే పరీక్షలను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు? ఏయే పరీక్షలు ఓఎంఆర్‌ పద్ధతిలో ఉంటాయన్న అంశాన్నీ కొత్త తేదీలతో పాటు ప్రకటించే అవకాశాలున్నట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

ఇక హార్టికల్చర్‌ అధికారుల పోస్టులకు పరీక్షపై కమిషన్‌ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. ఈ పరీక్షను యథావిధిగా నిర్వహించాలా? లేక కొత్త తేదీని రీషెడ్యూలు చేస్తుందా అన్న విషయమై నేడు స్పష్టత ఇవ్వనుంది. ఈ పరీక్షను గతంలో కమిషన్‌ ప్రకటించిన తేదీ ఏప్రిల్‌ 4. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కమిషన్‌ భావించింది. ఆ లెక్కన పరీక్ష తేదీకి వారం రోజుల ముందు ప్రవేశపత్రాలను వెబ్‌సైట్లో పొందుపరచాల్సి ఉంది. అంటే ఈ నెల 28వ తేదీ నాటికి అవి అందుబాటులోకి రావాలి. ఒకవేళ నేటికి ప్రక్రియ పూర్తికానట్లైతే పరీక్షను వాయిదా వేసే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం తీసుకోకుండా స్వల్ప వ్యవధిలోనే తిరిగి హార్టికల్చర్‌ పరీక్ష నిర్వహించేందుకు అనువైన తేదీలను కమిషన్‌ పరిశీలిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.