- Telugu News Photo Gallery Cinema photos Niharika konidela shares adorable Photos on instagram after long time
Niharika-JV Chaitanya: ఎట్టకేలకు మళ్లీ ఫొటోలు షేర్ చేసిన మెగాడాటర్ నిహారిక.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే..
Updated on: Mar 28, 2023 | 7:37 AM

మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ ప్రచారానికి ఆజ్యం పోసినట్లు చైతన్య తన సోషల్ మీడియా ఖాతాలోని తన పెళ్లి ఫోటోలన్నింటనీ డిలీట్ చేశాడు. ఒకరిఖాతాలను మరొకరు అన్‌ఫాలో చేసుకున్నారు కూడా. పైగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నీహారిక కూడా ఈ మధ్య సైలెంట్ అవ్వడంతో ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు విడాకులు తీసుకునే ముందు తమ పెళ్లిఫొటోలను సోషల్ మీడియాల్లో డిలీట్ చేయడం ద్వారా హింట్ ఇస్తున్నారు. దీంతో నీహారిక-చైతన్య కూడా విడిపోతున్నారేమోనని అందరూ అనుకున్నారు.

నిహారిక చివరిసారిగా నవంబర్ 9న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసింది. ఆ తర్వాత ఎటువంటి పిక్స్ పోస్ట్ చేయలేదు. దాదాపు నాలుగు నెలల తర్వాత లంగా వోణీలో ట్రెడిషనల్‌గా ఉన్న బ్యూటిఫుల్ ఫొటోలను తాజాగా ఇన్‌స్టా ఖాతాలో నిహారిక షేర్ చేసింది.

ఈ ఫోటోలను చూసిన అభిమానులు మాటలు రావడంలేదు.. ఎంతందంగా ఉన్నావో అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో నీ భర్త ఎక్కడ? మీరు ఎందుకు అన్‌ఫాలో చేసుకున్నారు? చైతన్య మీ ఫోటోలను ఎందుకు డిలీట్ చేశారంటూ ఆరా తీస్తున్నారు.

కోట్లు కుమ్మరించి పెళ్లి చేస్తే.. విడాకులు తీసుకోవడం ఏమిటో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఆమె పెట్టిన ఫోటోలకు నీ కామెంట్‌కు ఏమైనా సంబంధం ఉందా అంటూ ఆమె అభిమానులు కౌంటర్లిస్తున్నారు.





























