TSPSC paper leak case: ‘అంగట్లో ఏఈ ప్రశ్నాపత్రం.. ఉపాధి హామీ పథకంలోని యువకులే టార్గెట్’ షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి
తెలంగాణలో ప్రశ్నాపత్రాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేజులో ఇప్పటి వరకు 15 మందికిపైగా పోలీసులు అరెస్టు చేశారు. సిట్ అధికారుల విచారణలో తవ్వేకొద్దీ కొద్దీ పాత్రదారుల పేర్లు బయటపడుతూనే ఉన్నాయి. ఈనెల 5న జరిగిన ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రం ప్రధాన నిందితుల..
తెలంగాణలో ప్రశ్నాపత్రాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేజులో ఇప్పటి వరకు 15 మందికిపైగా పోలీసులు అరెస్టు చేశారు. సిట్ అధికారుల విచారణలో తవ్వేకొద్దీ కొద్దీ పాత్రదారుల పేర్లు బయటపడుతూనే ఉన్నాయి. ఈనెల 5న జరిగిన ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రం ప్రధాన నిందితుల వద్ద నుంచి పలువురి చేతులు మరింది. నిందితురాలు రేణుక భర్త డాక్యా నాయక్ ఉపాధి హామీ పథకంలోని యువకులే టార్గెట్‌గా ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఏఈ పేపర్ లీక్ కేసులో కీలక వ్యక్తిగా డాక్యా నాయక్‌ను అధికారులు గుర్తించారు.
వికారాబాద్ జిల్లా డీఆర్‌డీఏలో పనిచేసిన డాక్యా నాయక్‌కు ఉపాధి హామీ పథకంలో పనిచేసే యువకులతో మంచి పరిచయాలు ఉండేవి. దీంతో ఉపాధి హామీలో పనిచేస్తూ ఏఈ పరీక్ష రాసే వారికోసం డాఖ్యా నాయక్, అతని బామ్మర్ది రాజేశ్వర్ ఆరా తీశారు. ఈ క్రమంలో నవాబ్ పేటలో పనిచేసే ప్రశాంత్ రెడ్డికి 7.5 లక్షలకు డాఖ్యా ఏఈ ప్రశ్నాపత్రం అమ్మాడు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే మరో వ్యక్తి రాజేంద్ర కుమార్‌కు రూ.10 లక్షలకు అమ్మాడు. డాఖ్యా వద్ద తన 10 లక్షలు ప్రశ్నాపత్రం కొన్న రాజేంద్ర తన సొమ్మును తిరిగి సంపాదించుకునేందుకు మరికొంత మందికి ఆ పేపర్‌ను అమ్ముకున్నాడు. ఈ కేసులో రాజేంద్ర కుమార్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇంకా ఈ వ్యవహారంలో ఎవరెవరిపాత్ర ఉందో తెలుసుకునే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఈ కేసులో తాజాగా తిరుపతి అనే వ్యక్తిని సిట్ అధికారులు అరెస్టు అయ్యాడు..దాంతో అరెస్టు సంఖ్య 15కి చేరింది.రేణుక భర్త డాక్యా తిరుపతి ఏఈ ప్రశ్నాపత్రం పొంది, దాన్ని రాజేందర్‌కి విక్రయించాడు..ఈ కేసులో ఇప్పటివరకూ 65 మందిని విచారించారు. పరీక్షరాసిన 65 మందికి లీకేజీతో సంబంధంలేదని సిట్ నిర్ధారణకు వచ్చింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.