Monkey Attack: వనం వీడి జనావాసాల్లోకి కోతులు.. స్కూల్ విద్యార్థులపై వానరసైన్యం దాడి.. చిన్నారికి గాయాలు
అవకాశం దొరికితే చాలు.. కుక్కలు, కోతులు విరుచుకుపడుతున్నాయి. జనంపై పడి దాడులు చేస్తున్నాయి. చిన్న పిల్లలు కనిపిస్తే చాలు ఏకంగా అటాక్ చేస్తున్నాయి. భద్రాచలం జిల్లాలో స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులపై కోతులు దాడి చేశాయి. గుంపులుగా వచ్చిన కోతులు విద్యార్థినిపై దాడి చేశాయి.
ఓ వైపు రోజు రోజుకీ కుక్కలు స్వైరవిహారం చేస్తుంటే.. మరోవైపు మేమున్నామంటూ కోతులు హడలెత్తిస్తున్నాయి. వానరాలు వనం వీడి జనంలోకి వచ్చి.. ఆహారం కోసం జనావాసాలపై దాడి చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. చిన్నారులను వణికిస్తున్నాయి.. మనుషులపై దాడులు చేస్తున్నాయి రోడ్డుపై వెళ్లే పిల్లలను కూడా హడలెత్తిస్తున్నాయి. నిన్నటివరకూ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కుక్కల బెడదతో హడలెత్తిపోయారు ప్రజలు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వీధికుక్కలు గుంపులుగా తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోతులు స్వైరవిహారం చేస్తూ.. జనాలను హడలెత్తిస్తున్నాయి.
నిజానికి అవకాశం దొరికితే చాలు.. కుక్కలు, కోతులు విరుచుకుపడుతున్నాయి. జనంపై పడి దాడులు చేస్తున్నాయి. చిన్న పిల్లలు కనిపిస్తే చాలు ఏకంగా అటాక్ చేస్తున్నాయి. భద్రాచలం జిల్లాలో స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులపై కోతులు దాడి చేశాయి. గుంపులుగా వచ్చిన కోతులు విద్యార్థినిపై దాడి చేశాయి. అందరూ ఉండగానే బాలికపై దాడికి దిగింది వానరం. భద్రాచలంలో రోజు రోజుకీ కోతుల బెడద పెరిగిపోతోంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పాఠశాలకు వెళ్తున్న చిన్నారిపై మాకుమ్మడిగా దాడి చేసాయి కోతులు. సైకిల్ పై స్కూల్‌కి వెళుతున్న విద్యార్థులను కోతులు ఒక్కసారిగా చుట్టు ముట్టాయి. కోతుల దాడిలో చిన్నారి వెష్ణవి గాయపడింది. కాలుకి గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కోతులతో ఉన్న ముప్పు గురించి అనేకసార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..