KTR: దేశంలో ఈ పరిస్థితికి కాంగ్రెస్, బీజేపీలే కారణం.. టీవీ9 ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్.
దేశంలో ఇంకా దరిత్రమైన పరిస్థితులు ఉన్నాయంటే దానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కారణం కాదా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అటు బీజేపీతో పాటు కాంగ్రెస్‌పై కూడా విరుచుకుపడ్డారు. 50 ఏళ్లు కాంగ్రెస్, 15 బీజేపీ పాలించింది. దేశంలో ఇంకా...

దేశంలో ఇంకా దరిత్రమైన పరిస్థితులు ఉన్నాయంటే దానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కారణం కాదా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అటు బీజేపీతో పాటు కాంగ్రెస్‌పై కూడా విరుచుకుపడ్డారు. 50 ఏళ్లు కాంగ్రెస్, 15 బీజేపీ పాలించింది. దేశంలో ఇంకా ఈ దరిద్రమైన పరిస్థితులు ఉన్నాయంటే కాంగ్రెస్, బీజేపీ కారణం కాదా అన్నారు. అలాంటప్పుడు ఆ రెండు పార్టీలతో ఎందుకు పోవాలని మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు.
మోదీ కంటే మన్మోహన్, పీవీ ఉత్తమ ప్రధాని అన్న మంత్రి కేటీర్.. 15 మంది ప్రధానుల్లో అసమర్ధ పీఎం మోదీనేనని విమర్శించారు. మంత్రి ఇంకా మాట్లాడుతూ.. ‘మేం ఏపార్టీకి తొత్తులం కాదు, ఏ టీమ్ కాదు, బీ టీమ్ కాదు. మేం రాష్ట్రంలో ఉన్న బీదా బిక్కీ టీమ్. డీమానిటైజెషన్, ప్రెసిడెంట్ బిల్లు లాంటి వాటికి మద్ధతు ఇచ్చాం. హిమాంత బిశ్వశర్మ లాంటి నేతల వ్యాఖ్యలను ఖండించాం. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే.. మేమిద్దరమే ఉండాలి. రెండు లేకి పార్టీలకు బీ టీమ్‌గా ఉండాల్సిన అవసరం మాకేంటి’ అంటూ విరుచుకుపడ్డారు.
ఇక ఆటం బాంబు పడ్డ జపాన్ కూడా దూసుకుపోతోందన్న మంత్రి కేటీఆర్. మనం మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నామన్నారు. ఈ పరిస్థితి రావడానికి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ప్రధాన కారణం కాదా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి..




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
