Telangana Politics: నెరవేర్చని హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.. తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఒవైసీ మరోసారి ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. రాష్ట్రంలో అభివృద్ది జరిగితే స్వాగతించామని , నెరవేర్చని హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు ఒవైసీ.

MIM Vs BRS: తెలంగాణలో బీఆర్‌ఎస్-మజ్లిస్ మధ్య దూరం మరింత పెరిగింది. బీఆర్‌ఎస్ పాలనపై మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ. తెలంగాణలో గత 10 ఏళ్లలో మతకలహాలు లేవన్న ఒవైసీ మతతత్వం పెరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించిన ప్రభుత్వం ఇస్లామిక్ సెంటర్‌ను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులను కలవడంలో తప్పు లేదన్నారు అసద్. ఎయిర్‌పోర్ట్ మెట్రో విస్తరణ గురించి కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరితో కేటీఆర్ మాట్లాడినట్టు తెలిసిందని, జూబ్లీబస్టాండ్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో విస్తరించాలని తమ ప్రతిపాదనను కూడా ప్రస్తావిస్తే బాగుండేదన్నారు.
నిమ్స్ ఆస్పత్రిని అభివృద్ది చేస్తున్న ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రిని ఎందుకు అభివృద్ది చేయడం లేదని ప్రశ్నించారు. సెక్రటేరియట్ నిర్మాణం సమయంలో కూల్చిన మసీదుకు మళ్లీ నిర్మించలేదన్నా ఒవైసీ. ప్రభుత్వం మంచి చేస్తే స్వాగతించామని , అభివృద్దిపై ఇప్పుడు ప్రశ్నిస్తున్నాన్నారు.
బోధన్‌లో మజ్లిస్ కార్యకర్తల అరెస్ట్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అసద్ మరోసారి ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
