AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: జూనియ‌ర్ డాక్టర్లు స‌మ్మెపై మంత్రి కేటీఆర్ సీరియస్.. సమ్మెకు ఇది సరైన సమయం కాదు.. విధుల్లో చేరాలని పిలుపు

రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో జూనియర్ డాక్టర్ల సమ్మె చేయడంపై రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెకు ఇది సరైన సమయం కాదని.. సమ్మెను విరమించాలన్నారు.

KTR: జూనియ‌ర్ డాక్టర్లు స‌మ్మెపై మంత్రి కేటీఆర్ సీరియస్.. సమ్మెకు ఇది సరైన సమయం కాదు.. విధుల్లో చేరాలని పిలుపు
Ktr Tweet
Balaraju Goud
|

Updated on: May 26, 2021 | 4:37 PM

Share

Minister KTR Reacts: తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియ‌ర్ డాక్టర్లు చేప‌ట్టిన స‌మ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో జూనియర్ డాక్టర్ల సమ్మె చేయడంపై రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెకు ఇది సరైన సమయం కాదని.. సమ్మెను విరమించాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కేటీఆర్. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చింది. జూనియ‌ర్ డాక్టర్లు త‌క్షణ‌మే స‌మ్మె విర‌మించి విధుల్లో చేరాల‌ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ దగ్గర జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. మెడికల్‌ కాలేజీ బయట జూడాలు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరావాలి, డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేస్తున్నారు. కేసీఆర్ సర్.. మాటల్లో చెప్పినవి, చేతల్లో చేసి చూపించాలంటూ ఫ్లకార్డులు చేతపట్టారు. మా ప్రాణాలకు విలువ లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు జూనియర్ డాక్టర్లు.

అయితే, ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చారు. పెంచిన స్టైఫండ్‌, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలన్నది వారి డిమాండ్. ‌దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే.. ఈ నెల 28న కోవిడ్‌, అత్యవసర సేవలూ బహిష్కరిస్తామని హెచ్చరించారు జూనియర్ డాక్టర్లు.

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో.. అసలే వైద్య సిబ్బంది తగినంత మంది లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్ర ప్రభావం చూపనుంది. కరోనా రోగులకు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

మరోవైపు కేంద్రం క‌లగ‌జేసుకోక‌పోవ‌డం వ‌ల్లే టీకాల కొర‌త ఏర్పడింద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైద‌రాబాద్ టీకా హ‌బ్ అయినా గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిల‌వాల్సి వ‌చ్చింద‌న్నారు. కోటి వ్యాక్సిన్ల‌కు ప్రభుత్వం ఇప్పటికే టెండ‌ర్లు పిలిచింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

Read Also…  Narsapuram MP RRR: ఎంపీ ర‌ఘురామకృష్ణ రాజు డిశ్చార్జ్ మరో ట్విస్ట్.. ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక