EETALA RAJENDAR: కమలం వైపే ఈటల.. అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి..!

టీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యేగిరిని అంటిపెట్టుకుని వుండి.. ఇంకా అవమానాలు పడడమా? లేక తన ఆత్మాభిమానానికే ప్రాధాన్యతనిచ్చి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. గులాబీ దళపతితో అమీతుమీకి సిద్దమవడమా? ఇలా రెండు ప్రాధాన్యతలు ఈటల రాజేందర్ ముందున్నాయి.

EETALA RAJENDAR: కమలం వైపే ఈటల.. అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి..!
Eetala Rajendar, Bandi Sanjay, Amit Shah
Follow us

|

Updated on: May 26, 2021 | 4:27 PM

EETALA RAJENDAR JOINING BJP SOON: టీఆర్ఎస్ పార్టీ (TRS PARTY) నుంచి ఇంకా బయటికి రానప్పటికీ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇక భవిష్యత్ రాజకీయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి పదవి నుంచి అవమానకరరీతిలో తప్పించిన టీఆర్ఎస్ అధినాయకత్వం (TRS HIGH COMMAND).. ఆ తర్వాత కూడా ఈటలను, ఆయన కుటుంబాన్ని వదలడం లేదు. తొలుత ఈటలపై రెండు భూకబ్జా కేసులు నమోదు కాగా.. తాజాగా ఆయన తనయుడు నితిన్‌పై కూడా భూకబ్జా ఆరోపణలు రాగా.. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యేగిరిని అంటిపెట్టుకుని వుండి.. ఇంకా అవమానాలు పడడమా? లేక తన ఆత్మాభిమానానికే ప్రాధాన్యతనిచ్చి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. గులాబీ దళపతితో అమీతుమీకి సిద్దమవడమా? ఇలా రెండు ప్రాధాన్యతలు ఈటల రాజేందర్ ముందున్నాయి.

అయితే.. ఈటలపై చర్యలు మొదలై.. ఆయన ఏకాకి అయినప్పట్నించే ఆయనకు గాలమేయడం ప్రారంభించాయి అటు కాంగ్రెస్ (CONGRESS PARTY), ఇటు బీజేపీ (BJP). కాంగ్రెస్ పార్టీ తరపున ఏకంగా టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంటు భట్టి విక్రమార్క (BHATTI VIKRAMARKA) స్వయంగా ఈటలను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి (KONDA VISWESWAR REDDY) కూడా ఈటలను కలిశారు. అయితే.. వెంటనే నిర్ణయం తీసుకోని ఈటల మరిన్ని రోజులు వేచి చూసే ధోరణి ప్రదర్శించారు. ఈక్రమంలోనే రాజకీయ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌ (D SRINIVAS)ను కలిశారు. ఆయనతో సుదీర్ఘంగా సాగిన మంతనాల తర్వాత ఈటల దాదాపు మౌనంగానే వుండిపోయారు. నిజానికి డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (TELANGANA RASHTRA SAMITI)లో చేరగా.. ఆయనకు రాజ్యసభ సీటునిచ్చి గౌరవించారు గులాబీ దళపతి కేసీఆర్ (KCR). కాకపోతే.. నిజామాబాద్ (NIZAMABAD) రాజకీయాల్లో డీ.శ్రీనివాస్ ఆధిపత్యాన్ని సహించని జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (TRS MLAs) ఫిర్యాదు చేయడంతో కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టారు. కానీ పార్టీ వ్యవహారాలకు దూరంగా వున్నప్పటికీ డీఎస్ (DS).. తన రాజ్యసభ పదవిని మాత్రం వదులుకోలేదు. తీసుకుంటే టీఆర్ఎస్ (TRS) చర్యలు తీసుకోని గాక.. తాను మాత్రం తప్పుకోను అన్నట్లుగా డీఎస్ వుండిపోయారు. అయితే డీఎస్, ఈటల భేటీ సందర్భంగా డీఎస్ తనయుడు, బీజేపీ ఎంపీ (BJP MP) ధర్మపురి అరవింద్‌ (DHARMAPURI ARVIND) కూడా ఈటలతో కాసేపు ముచ్చటించనట్లు సమాచారం.

ఇదేవిధంగా డీఎస్ తరహా వ్యూహాన్ని ఈటల అనుసరిస్తారా అన్న అనుమానం కలిగింది. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయకపోతే తనపై స్పీకర్ (SPEAKER) చర్య తీసుకునే అవకాశాలు లేవు. దాంతో వీలైనంత ఎక్కువ కాలం.. ఎమ్మెల్యేగా కొనసాగడం ద్వారా తన వ్యాపారాలకు ముప్పు రాకుండా చూసుకుంటారన్న కథనాలు కూడా వచ్చాయి. కానీ.. తన నియోజకవర్గంలో చాపకింద నీరులా తన క్యాడర్‌ను, తన అనుచర వర్గాన్ని నయానాభయానా టీఆర్ఎస్ మంత్రులు (TRS MINISTERS) తన నుంచి లాగేసుకోవడాన్ని ఈటల గ్రహించారు. ఈక్రమంలోనే మంత్రి గంగుల కమలాకర్ (GANGULA KAMALAKAR) లక్ష్యంగా ఈటల విరుచుకుపడ్డారు. ‘‘ బిడ్డా.. నీ సంగతి చూస్తాను’’ అని ఘీంకరించారు. ఇదంతా జరిగిన వారం తర్వాత ఈటల పక్కా వ్యూహంతో కదలుతున్నట్లు కథనాలు మొదలయ్యాయి. తాజాగా బీజేపీ వైపు ఈటల చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసిన తర్వాత తాను బీజేపీలో చేరకుండా ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని.. దానికి బీజేపీ మద్దతివ్వాలని ఈటల బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. దానికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (BANDI SANJAY) ససేమిరా అనడంతోపాటు తమది జాతీయ పార్టీ అని హుజురాబాద్‌కు బైపోల్ వస్తే పోటీ చేయకుండా వుండలేమని బండి స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరిపోటీ చేస్తే.. దుబ్బాక (DUBBAKA BY-POLL) ఫలితాన్ని రిపీట్ చేద్దామని బండిసంజయ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. బండి, ఈటల భేటీ నుంచే బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ కన్వీనర్ డా. కే.లక్ష్మణ్‌ (DR K LAXMAN) కు, కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (G KISHAN REDDY)కి ఫోన్‌లో సంభాషణలు జరిగినట్లు సమాచారం.

ఇదే క్రమంలో కిషన్ రెడ్డి నేరుగా ఢిల్లీ (DELHI) నుంచి మొయినాబాద్ శివారుల్లోని మాజీ ఎంపీ వివేక్‌కు చెందిన ఫామ్ హౌజ్‌కు వెళ్ళి ఈటలతో మంతనాలు జరిపినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. కానీ ఈ కథనాలను కిషన్ రెడ్డి వర్గం తోసిపుచ్చుతోంది. అయితే.. ఈటల, కిషన్ రెడ్డి భేటీ ఇంకా జరగలేదని, త్వరలో జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదిలా వుంటే.. మే 26 మధ్యాహ్నం తర్వాత వెల్లడైన సమాచారం ప్రకారం ఈటల కాషాయతీర్థం పుచ్చుకోవడం ఖాయమంటున్నారు. ఈటలతో జరిగిన భేటీ తర్వాత ఈటల, ఆయన వెంట వచ్చే టీఆర్ఎస్ అసంతృప్త నేతల జాబితాను బండి సంజయ్ జాతీయ నాయకత్వానికి పంపినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితరులతోపాటు మరికొందరు టీఆర్ఎస్ అసంతృప్త నేతలు ఈటలతోపాటు బీజేపీలో చేరతారంటూ బండి సంజయ్ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డాకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదిక పంపారని తెలుస్తోంది. వీరిద్దరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు.. ఢిల్లీలో అపాయింట్ మెంటు ఇచ్చిన వెంటనే ఈటల అండ్ కో.. హస్తిన బాటపడతారని అంటున్నారు. ఆ తర్వాత బీజేపీలో వీరంతా చేరడం లాంఛనమేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

ALSO READ: లక్ష్యద్వీప్‌లో వేర్పాటు చిచ్చు.. నియంత్రిస్తున్నారంటూ ఆందోళనపర్వం

ALSO READ: బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల పంపిణీలో కేంద్రం కీలక నిర్ణయం.. వెల్లడించిన ఆరోగ్య శాఖ

ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!