BLACK FUNGUS: బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల పంపిణీలో కేంద్రం కీలక నిర్ణయం.. వెల్లడించిన ఆరోగ్య శాఖ

బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రాలు కోరుతున్నట్లుగా బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే మందులను ప్రాధాన్యతాక్రమంలో కేటాయించింది.

BLACK FUNGUS: బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల పంపిణీలో కేంద్రం కీలక నిర్ణయం.. వెల్లడించిన ఆరోగ్య శాఖ
Black Fungus Patients + Injections + Dr Harsha Vardhan
Follow us
Rajesh Sharma

|

Updated on: May 26, 2021 | 3:14 PM

BLACK FUNGUS ISSUE GOVERNMENT DECISION: బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) రాష్ట్రాలకు గుడ్ న్యూస్ (GOOD NEWS) తెలిపింది. రాష్ట్రాలు కోరుతున్నట్లుగా బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే మందులను ప్రాధాన్యతాక్రమంలో కేటాయించింది. మ్యూకోర్మైకోసిస్ (MUCORMICOSIS) చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి (AMPHOTYRICYNE-B) ఇంజెక్షన్లను రాష్ట్రాలకు వారి వారి అభ్యర్థన మేరకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) క్రమంగా తగ్గుముఖం పడుతుందన్న ఆనందాన్ని లేకుండా చేస్తోన్న బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మహారాష్ట్ర (MAHARASHTRA), ఢిల్లీ (DELHI), యుపీ (UP), ఏపీ (AP)లలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలలోను బ్లాక్ ఫంగస్ కేసులున్నప్పటికీ.. అంత ఆందోళనకరమైన స్థాయిలో లేవు. ఈ క్రమంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలు యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్లను కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరాయి. ఈ క్రమంలోనే ముకోర్మైకోసిస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అదనపు కేటాయింపులు జరిపింది.

దేశ వ్యాప్తంగా సుమారు 11 వేల 717 మంది బాధితులు బ్లాక్ ఫంగస్ చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. దాంతో 29 వేల 250 యాంఫోటెరిసిన్-బి వయల్స్ పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయిస్తూ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ (TELANGANA) రాష్ట్రంలో 744 రోగులకు గాను 1,890 యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు కేటాయించారు. వీటిని అవసరమైన చోట్లకు అవసరమైన మేరకు తరలిస్తామని తెలంగాణ మంత్రి (TELANGANA MINISTER) సబితా ఇంద్రారెడ్డి (SABITHA INDRA REDDY) ప్రకటించారు.

ఒక వైపు కరోనా మహమ్మారి మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌… ఇలా జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక వైపు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ (LOCK DOWN), వ్యాక్సినేషన్‌ (VACCINATION) కొనసాగుతుంటే కొత్తగా వచ్చి చేరిన బ్లాక్‌ ఫంగస్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఆ బ్లాక్‌ ఫంగస్‌ అనేది కేంద్ర ఆరోగ్యశాఖ (UNION HEALTH MINISTRY)కు పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 9 వేల వరకు కేసులు నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్లాక్‌ ఫంగస్‌ వల్ల మెదడులో ఇన్ఫెక్షన్‌, ఊపిరితిత్తులకు ప్రమాదం పొంచివుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు బ్లాక్‌ ఫంగస్‌ కరోనా వైరస్‌ సోకిన వారికే వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులు దేశంలోని 18 రాష్ట్రాల్లో న‌మోద‌య్యాయి. ఢిల్లీలో ఇప్పటివరకు 500 బ్లాక్‌ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్ర‌భుత్వం (DELHI GOVERNMENT) బ్లాక్ ఫంగ‌స్ కేసుల చికిత్స‌కు పలు హాస్పిటళ్ల‌ను కేటాయించింది. ఢిల్లీలో రోజుకు 40 బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ (UNION HEALTH MINISTER DR HARSHAVARDHAN) ఆసక్తికర అంశాలు వెల్లడించారు. భారత్ (BHARAT) లో ప్రస్తుతం అనేక కరోనా వేరియంట్లు వ్యాపిస్తున్నప్పటికీ, అన్నింట్లోకి బి. 1.617 వేరియంట్ (B.1.617 VARIENT) అత్యంత తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందని తెలిపారు. మిగతా వేరియంట్ల కంటే అధిక స్థాయిలో వ్యాపిస్తోందని వివరించారు. దేశంలోని 55 శాతం కొవిడ్ కేసులకు బి.1.617 వేరియంటే కారణమని హర్షవర్ధన్ వెల్లడించారు. ఇతర కేంద్ర మంత్రులతో కొవిడ్ పరిస్థితులపై సమీక్ష సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. బి.1.617 వేరియంట్ ను మొదటగా మహారాష్ట్రలో గుర్తించామని… ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, ఏపీల్లో ఎక్కువగా ఉనికి చాటుకుంటుందన్నారు.

ALSO READ: లక్ష్యద్వీప్‌లో వేర్పాటు చిచ్చు.. నియంత్రిస్తున్నారంటూ ఆందోళనపర్వం